ఫిలడెల్ఫియాలో మరోసారి ప్రవాస తెలుగువారు, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐ టిడిపీ కార్యకర్తలు అమెరికా ప్రజాస్వామ్య పోరాటానికి జన్మస్థలమైన వ్యాలీ ఫోర్జ్ స్మారకచిహ్నం కలిగిన “వాలీ ఫోర్జ్ నేషనల్ పార్క్”లో ఆదివారం సాయంత్రం తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపారు.
అత్యంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం కోసం వ్యాలీ ఫోర్జ్ పార్క్ నుండి అమెరికా ప్రజాస్వామ్య సైనికులు సాధించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.
తెలుగు రాష్ట్రాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అవగాహన తీసుకు రావటంలో సైబర్ టవర్స్ పాత్ర చాలా విలువైనదనీ, అటువంటి సైబర్ టవర్స్ తో మొదలుపెట్టి సైబరాబాద్ నేడు అమెరికాలోని నగరాలతో పోటీ పడుతోందంటే దాని వెనుక దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉందని పలు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.
ఇవాళ అమెరికా నలుమూలలా తెలుగు వారు వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి చేరటానికి చంద్రబాబు గారు, ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ప్రధాన కారణమని పలువురు కొనియాడారు.
చంద్రబాబు గారు త్వరగా అక్రమ కేసుల నుండి విముక్తి పొంది, కడిగిన ముత్యములాగా బయటికి రావాలని ప్లకార్డులు ప్రదర్శించగా, జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని “నిజం గెలవాలి”, “వీ అర్ విత్ సిబిఎన్” నినాదాలతో సభాస్థలి మారుమ్రోగింది.
ఈ కార్యక్రమంలో పెన్సిల్వేనియా, డెలావేర్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస తెలుగు వారు జోరువానను, చలిని లెక్కచేయక పాల్గొన్నారు.