నిన్నటి వరకు పిచ్చి మొక్కగా పట్టించుకోని వారంతా ఇప్పుడు ఆ మొక్కకు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా కలుపు మొక్కల మాదిరి.. లైట్ తీసుకున్న దానిలో దాగున్న అద్భుతాన్నితాజాగా శాస్త్రవేత్తలు గుర్తించటంతో ఇప్పుడా మొక్క అపురూపంగా మారిపోయింది. అరబిడోప్పిస్ థాలియానా మరోమాటలో చెప్పాలంటే థేల్ క్రెస్ మొక్కగా దానికి పేరు. కలుపు మొక్కగా దాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
అలాంటి ఆ మొక్కలో రొమ్ముకేన్సర్ కు చెక్ పెట్టే అద్భుత గుణాలు ఆ మొక్కలో ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్ వర్సిటీ వారు గుర్తించిన ఈ విషయంతో ఇప్పుడా మొక్క విలువ ఒక్కసారిగా మారిపోయింది. రొమ్ము కేన్సర్ ను నయం చేసే క్రమంలో తరచూ కీమో థెరపీని వాడుతుంటారు. ఈ థెరఫీతో వచ్చే సమస్య ఏమంటే.. కేన్సర్ కణాలతో పాటు.. మామూలు కణాలు కూడా నశిస్తాయి. దీంతో.. రోగి మరింత బలహీనమవుతుంటారు.
అయితే.. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఇప్పటివరకు పిచ్చి మొక్కగా భావిస్తున్న మొక్క ఉపయోగపడుతుందట. ఈ మొక్కకు ఉన్న గుణం ఏమంటే.. కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధించటంతో పాటు.. సాధారణకణాల జోలికి అస్సలు వెళ్లదట. దీంతో.. చికిత్స త్వరగాపూర్తి కావటమే కాదు.. రోగి ఆరోగ్యం బలహీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు..ఇదేనేమో.