ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి ఇక్క డ అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నారు. అయితే..ఆయనే అసలు సమస్య కావడంతో తిరువూరు నియోజ కవర్గంలో పరిస్థితి దారుణంగా మారింది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాస రావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కూటమి దూకుడుతో ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే .. ఎప్పటికప్పుడు కొలికపూడి రాజకీయ కుంపటిని రాజేస్తున్నారు.
తాజాగా పార్టీ నాయకుడు, యువ నేత రమేష్‌రెడ్డి పై ఆరోపణలు రావడంతో ఆయనను పార్టీ నుంచి త ప్పించాలని.. సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి డిమాండ్ చేశారు. దీనికిగాను ఆయన 24 గంటల సమయం ఇచ్చారు. పార్టీ నుంచి బయటకు పంపించాలని పార్టీ అల్టమేటం జారీ చేశారు. అంతేకాదు.. రమేష్ ను పార్టీ నుంచి బయటకు పంపించకపోతే.. తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ రువ్వారు.
ఈ క్రమంలోనే పార్టీసీనియర్ నాయకులపైనా కొలికపూడి ఆరోపణలు చేశారు. ఇక, ఆయన పెట్టిన అల్టిమే టం ముగిసింది. ఇదిలావుంటే, రమేష్రెడ్డివాదన మరో విధంగా ఉంది. తనను కొలికపూడి రూ.2 కోట్లు డి మాండ్ చేశారని.. ఆ సొమ్ములు ఇవ్వనందుకే ఎమ్మెల్యే తనను టార్గెట్ చేశాడని ఆరోపించడంతో వివా దం మరింత వేడెక్కింది. ఇదిలావుంటే.. కొలికపూడి తీరుపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. తాజా ఉదంతంపై నివేదిక ఇవ్వాలంటూ.. ఎంపీ సహా రాష్ట్రస్థాయి నాయకులను కూడా ఆదేశించింది.
ఇక, ఇప్పుడు కొలికపూడికి వ్యతిరేకంగా టీడీపీలోని మెజారిటీ వర్గం చక్రం తిప్పుతోంది. తాడే పేడో తేల్చు కుందాం రమ్మంటూ.. కొలికపూడికి సవాల్ రువ్వారు. అంతేకాదు తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్లో చర్చకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో తిరువూరులో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై.. 144 సెక్షన్ విధించారు. అంతేకాదు.. టీడీపీలో కొందరు నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మొత్తానికి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.