‘ఉత్తర అమెరికాలో ఉన్నత స్థాయికి అతి వేగంగా దూసుకుపోతున్న ప్రపంచ భాషల్లో తెలుగు రెండో స్థానం లో ఉంది.
భారత దేశపు సాహిత్య సాంస్కృతిక కళా రంగాలు ప్రజలకి అనేక విధాలుగా స్ఫూర్తి నిస్తున్నాయి .
ఈ ఎదుగుదలకి ముఖ్యకారణం ,ఆధారం అమెరికాలో ఉన్న తెలుగు సంస్థలు అని నిస్సందేహం గా చెప్పవచ్చు
సంస్థల వ్యవస్థాపకులని వారి కృషిని ,శ్రమని, త్యాగాన్ని తలచుకోవాలి ,సన్మానించుకోవాలి.
సమైక్యత , సమత ప్రస్తుత కాలానికి అత్యవసరం ‘ అని విద్యావేత్త, సాహితీవేత్త డా.శొంటి శారదాపూర్ణ , నవంబరు 12న చికాగోలో ‘ సప్నా – భారతీ తీర్థ’ సంయుక్తంగా నిర్వహించిన సభ నిర్వహిస్తూ తెలిపారు.
సభా ప్రార్ధన తో ఆరంభమైన కార్యక్రమంలో తొలుత సప్నా – శ్రీ అన్న మాచార్య ప్రాజెక్టు అఫ్ నార్త్ అమెరికా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Dr. శొంటి శ్రీరామ్ నాలుగు దశాబ్దాలుగా సప్నా గురించి చెప్పారు.
తదుపరి చికాగో భారతీ తీర్థ వ్యవస్థాపకులు డా. తాతా ప్రకాశం గత రెండు శతాబ్దాలుగా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల వివరాలు తెలిపారు.
అట్లాంటా వాస్తవ్యురాలు , ప్రఖ్యాత వైద్యురాలు, రచయిత్రి, డా. పూడిపెద్ది రామ శేషు శర్మ వ్రాసిన ” విజయ గీత ” భగవద్గీత తెలుగు పద్య గ్రంథం మరియు న్యూయార్క్ వాస్తవ్యులు సాహిత్యం కలశం వ్యవస్థాపకులు డా. కలశపూడి శ్రీనివాస రావు చొరవ తీసుకొని పద్మశ్రీ KK ముహమ్మద్ తను మలయాళంలో వ్రాసిన ఆత్మకథను, Sri. L. R. స్వామి గారిచే ” నేను భారతీయుణ్ణి ” పెరుతో తెలుగు – లోకి తర్జుమా చేయించి ప్రచురించిన పుస్తకంగా ఆవిష్కరించెరు .
ఈ సభకి ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త , సహస్రావధాని , TTD అన్న మాచార్య ప్రాజెక్ట్ అధినేత డా.మేడసాని మోహన్ తన అధ్యక్షోపన్యాసం లో తెలుగు సాహిత్యానికి దేశ చరిత్ర ఎంత ఆవశ్యకమో అద్భుతంగా తెలిపారు.
ఆత్మీయ అతిధి ప్రముఖ చిత్రకారుడు, రచయిత, పద్మశ్రీ యస్వీ రామారావు KK ముహమ్మద్ ఆత్మ కథ లో ముఖ్యమైన అంశాలని తెలిపారు.
శ్రీ నూకల ప్రసాద్ తెలుగు భాషకి ఛందస్సు వ్యాకరణం ఎంత అవసరమో కవి సమ్రాట్ విశ్వనాథని గుర్తుచేస్తూ తెలిపారు. డా . దామరాజు లక్ష్మి, శ్రీ అప్పలనేని పద్మారావు, డా. బాబురావు, శ్రీ యడవిల్లి రమణ మూర్తి, శ్రీ జయదేవ్ రెడ్డి ఆవిష్కరణ పొందిన రెండు పుస్తకాల గురించి మాట్లాడారు.
డా. రామశేషు శర్మ విజయ గీత పద్య కావ్యం గురించి వివరిస్తూ తమ ఆనందాన్ని ప్రకటించారు.
రచయిత్రి డా. పూడిపెద్ది రామశేషుని భారతీ తీర్థ ‘సమాజ – సాహిత్య సేవ భారతి’ అన్న బిరుదుతో గౌరవించింది .
డా. కలశపూడి శ్రీనివాస రావు అంతర్జాలం లో ప్రశంసలు అందించారు.
గరిమెళ్ళ గోపాల కృష్ణ మూర్తి గానం చేసారు.
చికాగో లో ఉన్న అనేక సంఘాల అధినేతలు , ప్రముఖులు – పప్పు శ్యాంసుందర్, సయ్యద్ హాక్ , ఖాజా మొయిఉద్దీన్ , ఇంతియాజ్ ఉద్దీన్ , డా. ఉమాపతిరెడ్డి, శ్రీ భీమారెడ్డి , శ్రీ ఆజాద్ సుంకవల్లి , శ్రీ అష్ఫాక్ సయీద్ , డా. చిట్టూరి రత్నం , శ్రీమతి ఉమ కటికి , డా. సంయుక్త రెడ్డి ఇంకా ఎందరెందరో సాహితీ మిత్రులు సభకి హాజరయ్యారు. తెలుగు సభ వినూత్నం గా నడిచింది.