తెలుగుదేశం పార్టీ కి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక వ్యూహకర్త అవసరం లేదు. అధికారంలో ఉన్నపుడు పార్టీని నిర్లక్ష్యం చేస్తారన్న నింద బాబుపై సొంత నాయకుల్లో ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉంటే పార్టీని ఎలా నడిపించాలన్న దానిపై చంద్రబాబుకు తిరుగులేని వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఎన్ని వ్యూహాలు ఉన్నా గతంలో ప్రత్యర్థులతో పోలిస్తే జగన్ వెరీ స్ట్రాంగ్.
ఎందుకంటే జగన్ రెడ్డి మిగతా నాయకులు ఎవరూ వాడన సామధానబేధదండోపాయాలను ఉపయోగిస్తారు. దానిని ఎదురొడ్డి నిలవడం క్లిష్టతరమైన విషయం. అందుకు చంద్రబాబు పై ఎత్తు వేస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవడానికి జగన్ చరిత్ర, జగన్ గత హామీలు చాలంటున్నారట. అంతేగాకుండా జగన్ హామీలతో సంతృప్తి చెందేవారి కంటే అసంతృప్తి చెందే వారు ఎక్కువ. ఈ అసంతృప్తిని సరిగ్గా క్యాచ్ చేస్తే జగన్ బలమే బలహీనతగా మార్చవచ్చని చంద్రబాబు శ్రేణులకు వివరించారు.
ఇక దీంతో పాటు నాయకత్వాన్ని కూడా చంద్రబాబు రీ షఫుల్ చేశారు. ఇటీవలే రాష్ట్రాన్ని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారిగా వేరు చేసి ఒక్కోదానికి ఒక కమిటీని, ఒక్కో అధ్యక్షుడిని నియమించారు. అలాగే జిల్లా స్థాయిలో ఒక ఇన్ ఛార్జిని నియమించారు. ఇలా అన్ని జిల్లాలకు కలిపి 51 మంది నేతలకు కీలక పదవులు దక్కాయి. బీసీలకు ఇతర బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి బాగా కలిసి వచ్చిందంటున్నారు.
దానికితోడు జగన్ చేతిలో మోసపోయామన్న భావనలో ఉన్న బీసీలు రిగ్రెట్ ఫీలయ్యే పరిస్థితులు వచ్చాయి. దీంతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజల గొంతుకగా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పరిశ్రమలు, పెట్టబడుల ద్వారా సంపద పెంచకుండా పన్నులు పెంచి ప్రజలను ఏపీ సర్కారు పీక్కుతింటోందని, దీనిని బలంగా వినిపించాలని చంద్రబాబు వారిలో ఉత్సాహం నింపారు. దీంతో కొత్త కమిటీలు కదనరంగంలోకి దిగాయి.