బిజెపి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుంది. కానీ అదే బీజేపీ క్రిస్టియన్ మత ప్రచారం చేసే కుటుంబం నుంచి వచ్చిన జగన్ కి అండగా నిలుస్తుంది? దీని మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్లోని వైయస్ఆర్సిపి ప్రభుత్వం బిజెపి నుండి మద్దతు పొందుతుండగా… ఆ పార్టీకి బేస్ అయిన ఆర్ఎస్ఎస్ మాత్రం ఏపి ప్రభుత్వ అధినేతను ఎండగడుతోంది.
గత రెండేళ్లుగా AP లో మత మార్పిడులు పెరిగాయి, దళిత వర్గానికి చెందిన ప్రజలు చాలా వేగంగా క్రైస్తవ మతంలోకి మార్చబడతారని ఆర్ఎస్ఎస్ తన పత్రిక ద్వారా చెబుతోంది. మతమార్పిడిపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, మార్పిడికి కారణమైన వారిపై ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ సొంత పత్రిక… ఆర్గనైజర్ తాజా సంచికలో, జగన్ నేరుగా AP లోని అన్ని మార్పిడులకు బాధ్యత వహించే వ్యక్తిగా వ్యాఖ్యానించింది.
ఈ వాస్తవాన్ని బయటపెట్టినందుకే ఏపీ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ను అరెస్టు చేసిందని ఆ పత్రిక రాయడం సంచలనం.
గతంలో కూడా ఒకసారి ఆర్గనైజర్ జగన్ పాలనను తుగ్లక్ పాలనతో పోల్చింది. అతన్ని “తుగ్లకి జగన్” అని వ్యాఖ్యానించింది.
ఆ పత్రిక రాసిన తాజా కథనం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు తెలుగుదేశం నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. లేఖలో 13 ప్రశ్నలు సంధించారు.
ఆర్.ఎస్.ఎస్ పత్రికలో మీకు వ్యతిరేకంగా, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిలో, అవినీతి పరుడిగా సృష్టిస్తూ రాశారు కనుక వెంటనే సమాధానం చెప్పండి. భారత దేశ వ్యాప్తంగా సర్క్యులేషన్ కలిగిన పత్రికలో మన ముఖ్యమంత్రి గురించి అంత వ్యతిరేకంగా రాయడం మనసు బాధించింది. ముఖ్యమంత్రి ఆ పత్రికలో వచ్చిన కథనానికి సాక్ష్యాధారాలతో సహా సమాధానం చెప్పి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించాలి అంటూ ఈ 13 ప్రశ్నలు వేశారు.
• మత మార్పిడిలు మీ అజెండా అన్నారు నిజమా.?
• మీ చర్యవల్ల దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందా?
• అధికార సాధన కోసం మీరు హిందూ వ్యతిరేక విధానాన్ని పాటిస్తున్నారా?
• మీ విధానాలు విమర్శించినందుకు రఘురామరాజు అరెస్టు నిజమేనా?
• ఎమర్జెన్సీలో కూడా మీ పాలనలో ఉన్న వేధింపులు లేవట- నిజమేనా.?
• ప్రధానిని, జడ్జీలను కూడా టార్గెట్ చేస్తారని ఆ పత్రికలో ఉటంకించింది నిజమేనా.?
• మీకప్పుడు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదట నిజమేనా.?
• అయినా నీ సంపద వందల కోట్లట నిజమేనా.?
• మీరు దేశంలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని ఆ పత్రికలో చెప్పారు నిజమా.?
• ఆ రోజుల్లో మీ కంపెనీలో పెట్టుబడులు పెడితే పలు కంపెనీలకు మేలు చేకూర్చారట నిజమేనా.?
• హైదరాబాదులో, అమరావతిలో అత్యంత ఖరీదైన భవనాలు మీరు నిర్మించారట నిజమా.?
• బెంగళూరులో అత్యంత విలాసవంతమైన మీ భవనంలో హెలికాప్టర్లు దిగే సదుపాయం ఉన్నదా? ఆ భవనంలో 75 గదులు ఉన్న మాట నిజమేనా.?
• మత మార్పిడిలు ప్రోత్సహిస్తున్నది మీ రాజకీయ లబ్ధికోసమేనా.?
పై ప్రశ్నలన్నంటికీ సమాధానం చెప్పి ‘‘ది ఆర్గనైజర్’’ పత్రిక నోరు మూయించడని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలందరూ మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. మౌనంగా వుంటే అర్థాంగీకారం కాదు-రాజకీయాల్లో పూర్ణాంగీకారమే పరిగణించండి అని వర్ల రామయ్య వివరించారు.
https://www.youtube.com/watch?v=b-1RuiZVyoo&ab_channel=ABNTelugu