తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటన రాజకీయ పార్టీలలో అనేక సందేహాలను రేకెత్తించింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు మరియు జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు జరిగింది. చివరకు అధికారానికి ఆమడదూరంలో కేసీఆర్ ను బీజేపీ అడ్డుకోగలిగింది. ఇపుడు మేయర్ సీటు దక్కినా… అది మెజారిటీ లేని పదవి గానే మిగిలిపోనుంది.
ఇదిలా ఉండగా… ఎన్నికల ప్రచారంలో, సిఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు. బీజేపీ మీద విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడటానికి రైతుల ఉద్యమం వాడుకున్నారు. బీజేపీని మోడిని తీవ్రంగా విమర్శించారు.అంతలో నీ అంతు చూస్తాం అంటూ బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయి. నువ్వు బీజేపిన ఓడించడానికి ఆర్జేడీకి డబ్బులిచ్చావు అంటూ కూడా తెలంగాణ నేతలు కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.
మొత్తానికి ఏమైందో ఏమో … కేసీఆర్ సడెన్ గా ఢిల్లీ టూరు పెట్టారు. అమిత్ షా, మోడీని కలిశారు. జగన్ ఎంత అడిగినా దొరకని అప్మాయింట్మెంట్లు వెంటవెంటనే కేసీఆర్ కి ఇచ్చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇది వెళ్లినట్టు కాకుండా పిలిపించుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తరువాత చాలా ప్రశ్నలు తలెత్తాయి.
ఇటీవల కొత్త పార్లమెంటు ప్రాజెక్టుపై ప్రధాని మోదీని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. నిజంగా మోడీని ఎదురిస్తుంటే బెంగాల్ సీఎం మమతలాగ దూరంగా ఉండాలి. కానీ కేసీఆర్ వెళ్లాడు. గౌరవంగా వంగి దండం పెట్టి మరీ బీజేపీ పెద్దలను కలిశాడు. అంటే ఏదో జరుగుతోంది. అది ఏమై ఉంటుందో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ విశ్లేషించారు. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.