తాలిబాన్ల ఆక్రమణతో అఫ్గానిస్తాన్ అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. దేశం విడిచిపారిపోయేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. తెలంగాణ వాసులు కూడా పలువురు అక్కడే చిక్కుకున్నారు. తెలంగాణ ప్రజలైన బొమ్మెన రాజన్న, వెంకటయ్యలు తమతో పాటు మరో 14 మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
బాధితుల్లో ఒకరైన బొమ్మెన రాజన్న మంచిర్యాల వాసి కాగా. 8 ఏళ్లుగా ఇతను కాబుల్‌లోని ఏసీసీఎల్‌లో రాజన్న పనిచేస్తున్నారు. ఇటీవలే ఇండియాకు వచ్చి నెలన్నర రోజులు ఇక్కడే ఉండి తిరిగి వెళ్లారు.
దేశమంతా తాలిబన్ల వశమైన నేపథ్యంలో… అక్కడి భయానక వాతావరణం నుంచి బయటపడే మార్గాలన్నీ మూసుకుపోయాయని రాజన్న వాపోయారు.
ఇదిలా ఉంటే… న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలంగాణ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చే ప్రజలకు ఎలాంటి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అధికారులు మరియు న్యూఢిల్లీలోని AP భవన్ అధికారులు సమన్వయం చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన వారికి సంబంధించిన స్వదేశానికి పంపడం మరియు ఇతర అభ్యర్థనలను ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫ్ఘనిస్తాన్ సెల్ (SAC) తో సమన్వయం చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రజలకు సూచించింది. అవసరమైన చర్యల కోసం వారు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (RPO) దాసరి బాలయ్యను కూడా సంప్రదించవచ్చు.