అందుకే అంటారు.. రాజకీయాల్లో ఏం ఉన్నా లేకున్నా లక్ మాత్రం టన్నులు టన్నుల కొద్దీ ఉండాలి. లేకుంటే.. కేసీఆర్ మంత్రివర్గంలోని ఒక భారీ మంత్రి వ్యవహారం గడిచిన నాలుగైదు రోజులుగా పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తీసిన ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అమ్మాయి మీద మనసు పారేసుకున్న సదరు తెలంగాణ మంత్రివర్యులు.. ఆమె చేత సపర్యలు చేసుకునేందుకు తహతహలాడిపోయారు. దీనికి సంబంధించి తనకు సన్నిహితంగా ఉండే ఒక మహిళ చేత కథ నడిపించారు.
ఈ డర్టీ ప్రపోజల్ విన్నంతనే సదరు నటి సీరియస్ కావటమే కాదు.. ఇష్కూను సోషల్ మీడియాలోనూ.. టీఆర్ఎస్ పెద్దల వద్దకు తీసుకెళ్లిందట. దీంతో కంగుతిన్నసదరు మంత్రిగారు.. రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. తెలంగాణ సర్కారుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి చెందిన చానల్ లో దీనిపై పెద్ద స్టోరీ పబ్లిష్ కావటం.. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో విపరితంగా షేర్ అయ్యింది.
దీంతో.. ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు రంగంలోకి దిగటమే కాదు.. పెద్దాయనకు ప్రత్యేక రిపోర్టు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు మంత్రిగారి వ్యవహారాన్ని రానున్న రెండు.. మూడు రోజుల్లో సీఎం తేల్చేస్తారని అంటున్నారు. మరి.. మంత్రిగారి సీటు ఖాళీ అయితే.. ఆ పదవిని ఎవరికి ఇస్తారన్న సందేహం అక్కర్లేదని చెబుతున్నారు. మంత్రిగారికి డిమోషన్ చేసినంతనే.. తన కుమార్తె.. మొన్ననే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కవితకు పదవిని కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. మహిళ విషయంలో దారుణంగా వ్యవహరించిన మంత్రికి షాకివ్వటం.. మహిళకే ఆ పదవిని ఇవ్వటం ద్వారా లెక్కలు సరిగ్గా సరిపోతాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మరో వాదన వినిపిస్తోంది. మంత్రిగారి రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రికి ఎప్పుడో తెలుసని.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పేవారు లేకపోలేదు. కవితకు మంత్రి పదవి ఇప్పించేందుకే ఈ వ్యవహారం తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్న వారు లేకపోలేదు. వీరి వాదన ప్రకారం.. ఒకవేళ మంత్రి గారి రాసలీలల వ్యవహారం మిగిలిన చానళ్లలో రాకుండా.. సీఎంకు అత్యంత సన్నిహితులైన వారి మీడియాకు చెందిన దానిలో ప్రత్యేక కథనంగా ప్రసారం కావటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రాసలీలల మంత్రిగారి పదవీకాలం దాదాపుగా ముగిసినట్లేనని.. ఎమ్మెల్సీ కవితకు పదవిని కట్టబెట్టటమే మిగిలి ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.