నాకిష్టం వచ్చింది చేసినా మీరు నా వెంట్రుక పీకలేరు అని జగన్ స్వయంగా చెప్పేశారు. తాజా మంత్రి వర్గం కూర్పులో కూడా ఆయన అదే పని చేశారు. ఎవరిని ఎందుకు పీకేశారో ఎవరికి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో ఆయనకే తెలియాలి. రెడ్లకు న్యాయం చేయగా మిగిలిన పదవులను మిగతా వాళ్లకు పంచేశారు.
ఏపీలో మంత్రి ఎవరైనా ఆ శాఖ చూసేది మాత్రం సజ్జలే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అంత కీలకమైన సజ్జల కు నమ్మిన బంటులుగా ఉన్న కొందరు వైసీపీ నేతలకు మంత్రి పదవులు వరించాయి. వారిలో ఒకరు విడదల రజని.
చిత్రం ఏమిటంటే ఈమెది తెలంగాణ. ఆమె పుట్టింది, పెరిగింది తెలంగాణ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విడుదల రజనీ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్క పల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కుమార్తె. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక నేతకు మంత్రి పదవిని ఇవ్వటం ఏపీలో పెద్ద చర్చ నడుస్తోంది.
ఈమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. పబ్లిసిటీ బాగా ఎక్కువ. ఈమె ఆరేడేళ్ల క్రితమే తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నేత పుల్లారావు అనచరుల్లో ఒకరు ఆమె. మెల్లగా టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. తెలుగుదేశం పార్టీలో నేతగా ఎదిగే క్రమంలో.. మహానాడులో తనకు ప్రసంగించే అవకాశం లభించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరిని ఆకర్షించాయి. మీరు నాటి మొక్క సార్ నేను.. అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్నే క్రియేట్ చేశాయి. అంతే వెంటనే తన గురువు పుల్లారావు సీటు తనకిచ్చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మొన్న వచ్చి నిన్ను పరిచయం చేసిన వ్యక్తి సీటే అడిగావంటే ఇది మామూలు విషయం కాదు అని ఆమెను టీడీపీ పక్కన పెట్టింది. దీంతో ఆమె వైసీపీలో చేరింది.
తొలి ప్రయత్నంలోనే.. తన రాజకీయ గురువు పత్తిపాటి పుల్లారావును మట్టి కరిపించారు. ఆమె పబ్లిసిటీ డబ్బు ముందు పుల్లారావు నిలవలేకపోయారు. తాజాగా మంత్రి అయ్యారు.
ఆమె ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన వారంతా వేడక చేసుకుంటున్నారు. రజని తండ్రి సత్తయ్య ఫ్యామిలీ నలభై ఏళ్ల క్రితం ఊరి నుంచి హైదరాబాద్ కు వలస వెళ్లారు. సఫిల్ గూడలో ఉండేవారు. అలాంటిది ఆమె చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటం.. ఏపీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవటంతో ఇప్పుడు హాట్ టాపి క్ అయ్యింది.