5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ 7 నుంచి నవంబరు 30లోపు ఎన్నికలు నిర్వహించబోతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికలలో పోలింగ్ తేదీలు వేర్వేరు కాగా ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయని తెలిపింది. నవంబర్ 30న ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలో నామినేషన్లు దాఖలుకు ఆఖరు తేదీ: నవంబరు 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: నవంబరు 10
నామినేషన్ల పరిశీలన గడువు: నవంబరు 13
నామినేషన్లు ఉపసంహరణ తేదీ: నవంబరు 15
పోలింగ్ తేదీ: నవంబరు 30
కౌంటింగ్, ఫలితాల వెల్లడి: డిసెంబర్ 3
5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తేదీలు:
నవంబర్ 7: మధ్యప్రదేశ్ (230 సీట్లు), మిజోరం (90 సీట్లు), ఛత్తీస్ గఢ్ (90 సీట్లు) (తొలి విడత)
నవంబర్ 17: ఛత్తీస్ గఢ్ (రెండో విడత)
నవంబర్ 23: రాజస్థాన్ (200 సీట్లు)
నవంబర్ 30: తెలంగాణ (119 సీట్లు)
కౌంటింగ్, ఫలితాల ప్రకటన: డిసెంబర్ 3 (ఐదు రాష్ట్రాల ఫలితాలు ఒకే రోజు)