కేంద్రం రాష్ట్రాలు స్వయంగా డబ్బులు కట్టి వ్యాక్సిన్ కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చింది.
దీంతో అనేక రాష్ట్రాలు ఆ పనిచేశాయి. డబ్బులు కట్టిన రాష్ట్రాలు తమ వాటా మేరకు వ్యాక్సిన్ కొన్నాయి.
కానీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం అడ్వాన్స్ గా డబ్బులు కట్టకుండా కేవలం లేఖ రాశారు.
అందుకే కేంద్రం వాటా తప్ప … రాష్ట్రం స్వయంగా కొనుక్కునే అవకాశం మిస్ చేసుకుంది.
దీనిని కప్పి పుచ్చుకోవడానికి వ్యాక్సిన్ కేంద్రం కంట్రోల్లో ఉందని చెబుతున్నది జగన్ ప్రభుత్వం.
ఇదే కాదు, మాటిమాటికి ఏపీలో లేని సదుపాయాలు ఉన్నట్టు చూపడం
వేరే రాష్ట్రంలో ఫుడ్డు పెడితే జగన్ పెట్టాడు అని ప్రచారం చేయడం
అనంతపురంలో పెద్ద ఆస్పత్రి కట్టినట్టు అబద్ధం ప్రచారం చేయడం
ఎక్కడెక్కడో సదుపాయాలు ఏపీలో ఉన్నట్టు చెప్పడం వైసీపీ సోషల్ మీడియాకు చాలా కామన్ అయిపోయింది.
తాజాగా ఇటీవలే రెండు సార్లు పక్కోళ్ల ఫొటోలు వాడి దొరికిపోయారు జగన్ రెడ్డి.
తెలంగాణ ఫోటో ???? ఏపీలో ప్రచారం ???? pic.twitter.com/MhNZprPjQY
— I Love India✌ (@Iloveindia_007) May 20, 2021
తెలంగాణలోని ఆస్పత్రి ఫొటోలతో ఏపీలో ప్రకటనకు వాడారు అంటే ఏపీలో బెడ్ల పరిస్థితి ఫొటోకు పనికిరానంత ఘోరంగా ఉందనే కదా.