కాంగ్రెస్ పార్టీ అంతే.. ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ.. ఎప్పుడు మహిళా నేతల విషయంలో ఎలాంటి అపవాదులు ఎదుర్కోలేదు. చాలా మంది మహిళా నేతలు.. పార్టీలో ఎదిగారు. వారు ఎప్పుడూ.. ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న పరిస్తితిలేదు. అంతేకాదు.. ఎప్పుడూ.. వారు.. ఎలాంటి కేసులు పెట్టింది కూడా లేదు.
అలాంటి నిప్పు లాంటి పార్టీలో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేగింది. అది కూడా ఎదుగుతున్న దశలో ఉన్న తెలంగాణలోనే చోటు చేసుకోవడం గమనార్హం. తనను అత్యాచారం చేశాడంటూ.. ఒక కీలక కాంగ్రెస్ నాయకుడిపై అదే
పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై అదే పార్టీకి
హోటల్‌కు పిలిపించి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. శివకు మార్ రెడ్డి తన భార్య మూడేళ్ల కంటే బతకదని చెప్పి తన మెడలో పసుపుతాడు కట్టాడని ఫిర్యాదు పేర్కొంది. ఆయన తనకు పసుపుతాడు కట్టి కామవాంఛ తీర్చుకున్నాడని వెల్లడించింది.
ఇప్పుడు శివకుమార్‌రెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నాడని మహిళ ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో శివకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగింది?
బాధితురాలికి 2020 మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాను కేటాయించారు. ఆ సమయంలో సదరు నాయకురాలికి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ‘‘నా భార్య ఆరోగ్యం బాగుండదు. మూడేళ్లకు మించి బతకదు. నాకో తోడు కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా’’ అని ఆమెను నమ్మించాడు.
దుబ్బాక ఎన్నికల సమయంలో ఓ రోజు రాత్రి శివకుమార్‌రెడ్డి తప్పతాగి.. బాధితురాలు ఉంటున్న గదికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. పెళ్లికానిదే, అవేమీ ఉండవని సున్నితంగా తిరస్కరించా. జుట్టుపట్టుకుని, తీవ్రంగా దాడి చేశాడు. అని ఆమె తెలిపింది.
నేను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 2021 జూన్ 24న శివకుమార్ రెడ్డి నన్ను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా బలవంతం చేయబోగా.. ఒప్పుకోలేదు. దీంతో అతను ఓ పసుపు తాడు మెడలో కట్టి, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిపోయిందన్నాడు. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఓ సారి బెంగళూరులో పని ఉందంటూ తీసుకెళ్లి, అక్కడా అత్యాచారం చేశాడు. ఇటీవల బేగంపేటలోని ఓ హోటల్‌కు పిలిపించాడు. లైంగిక దాడికి యత్నించగా.. అడ్డుకున్నాను. దాంతో.. అతడు మాటల్లో పెట్టి.. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. నేను స్పృహకోల్పోగానే.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తన సెల్పోన్లో నగ్న చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత.. తన వద్ద నగ్నచిత్రాలు, వీడియోలు ఉన్నాయని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేశాడు.
తన అనుచరులతో నన్ను అవమానించేలా కుట్రలు పన్నాడు అని బాధితురాలు ఈ నెల 7న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్లు కూడా దృష్టి పెట్టినట్టు తెలిసింది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు.. చెబుతున్నాయి. ఇక, దీనిని రాజకీయంగా ప్రత్యర్థులు వినియోగించే అవకాశం ఉందని కూడా ఓ వర్గం నాయకులు భావిస్తున్నారు.