ఈ గవర్నమెంటోళ్లకి పిచ్చి కాకపోతే ఊర్ల పేర్లు, రోడ్ల పేర్లు, బిల్డింగుల పేర్లు మారుస్తారు గాని… నిజానికి జనం ఏం ఫిక్సయితే గదే పిలుస్తారు.
వైఎస్సార్ జిల్లా అని మారిస్తే పక్క జిల్లావోడు కాదు కదా.. కడప జిల్లా వోడు కూడా ఒప్పుకోలే.
ఎన్టీఆరో, రాజీవ్ గాంధో ఎవరైతే ఏంది… అది శంషాబాద్ ఎయిర్ పోర్టే.
ఇన్ని తెలిసి కూడా మళ్లీ రాజకీయ నాటకాలు ఆపరు. కుల మత రాజకీయాలు దేనికీ అతీతం కాదు.
ఓ వర్గాన్ని మచ్చిక చేసుకుని కాంగ్రెస్ కు ఉరి బిగించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ నెక్లెస్ రోడ్డుపై కన్నేశాడు.
తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఈ నెక్లెస్ రోడ్డును ఇపుడు పేరు మార్చారట.
ఇక నుంచి అది పీవీఎన్ఆర్ మార్గ్ అట.
అయినా… వీళ్లు మార్చుడు సరే గాని మనం పలుకుతామా ఏంది?
ఎన్టీఆర్ మార్గ్ అని రోడ్డేసినపుడే పెట్టినా దాన్నెవడూ అలా పిలవడు.
ఇపుడు పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్డును పీవీఆర్ మార్గ్ అని పెడితే పిలుస్తారా ఏంటి… నో నెవర్…
అది జనం మనసులో ఎప్పటికీ నెక్లెస్ రోడ్డు…
అయ్ బాబోయ్… మేము రాజకీయం గురించి మాట్లాడుతున్నాం గాని… ఆ మహానుభావుడు పీవీఆర్ మాత్రం ఈ రోడ్లకు పేర్లు పెట్టిన పెట్టకపోయినా జనం గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు.. ఆ జనంలో మేము కూడా ఉంటాం.