ఏపీ సీఎం జగన్ పాలనలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తనను విమర్శించిన నేతలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ తప్పులను ఎత్తి చూపుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై జగన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అచ్చెన్నాయుడిని టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నని అంతమొందించేందకు దువ్వాడ కుట్ర పన్నారని, దువ్వాడ నేతృత్వంలోనే తాజాగా నిమ్మాడలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా దువ్వాడ, ఆయన అనుచరులు వీరంగం వేశారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు ఇంటిపై దాడికి తెగబడేందుకు బహిరంగంగానే దువ్వాడ పిలుపునిచ్చారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిమ్మాడలో దువ్వాడ, ఆయన అనుచరులు హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో దువ్వాడ తన అనుచరులతో హల్ చల్ చేశారు. ఈ క్రమంలోనే కత్తులు, కర్రలతో నిమ్మాడలో దువ్వాడ, వైసీపీ నేతలు వీరంగం వేశారు. అచ్చెన్న ఇంటిపై దాడి చేసేందుకు దువ్వాడ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అచ్చెన్న సొంత ఊరు నిమ్మాడలో వేరే ఏ పార్టీ నేతకూ 10 ఓట్లు కూడా పడవని, అందుకే కింజరాపు కుటుంబం నుంచే అప్పన్నని ప్రలోభపెట్టి నామినేషన్ వేయించేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల హడావిడిలో అచ్చెన్న ఇంటిపై దాడి చేసేందుకు దువ్వాడ ప్రయత్నిస్తున్నారని టెక్కలి టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దువ్వాడ తన అనుచరులతో కలిసి కత్తులు, రాళ్లు, కర్రలు పట్టుకుని నిమ్మాడలో అప్పన్న నామినేషన్ సందర్భంగా హల్ చల్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. చేతిలో కర్ర పట్టుకున్న దువ్వాడ….తన అనుచరులను రెచ్చగొడుతూ వీధుల్లో వీరంగం వేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎవరు అడ్డు వస్తారో చూస్తా…అంటూ దువ్వాడ నిమ్మాడ వీధుల్లో వీరంగం వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ…పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ రకంగా ఆయుధాలతో బలప్రదర్శన చేసినా పోలీసు వ్యవస్థ చోద్యం చూడటం రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.