లాలూ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు తేజస్వి. ఇపుడు దేశమంతటా ఇతని గురించి చర్చ జరుగుతోంది. మహా ఉద్దండులకు నాయకత్వం వహించడం, ప్రపంచంలో మొనగాడు అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నాయకుడు, ప్రధాని మోదీని వణికించడంతో హీరో అయిపోయాడు.
19 ఏళ్లనాడే రాజకీయాల్లో ప్రవేశించిన తేజస్వి యాదవ్ ఈసారి సీఎం పీఠం దక్కించుకోకపోయినా తన సత్తా చాటాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జరిగిన పొరపాటును జరగనీయకుండా అందరికీ నాయకుడు అయిపోయాడు. ప్రధాని మోడీకి ఎదురు నిలిచి ప్రతిపక్షంలో ఉండి తన వాక్చాతుర్యంతో బీహాారీలను కట్టిపడేశాడు.
నాలుగు గ్రాండ్ అలయన్స్ లు ఉన్న చోట … రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు, అత్యధిక ఓట్లు సాధించారు. బీజేపీకి 82 లక్షల ఓట్లు, 74 సీట్లు వస్తే, తేజస్వి యాదవ్ కి 97 లక్షల ఓట్లు, 75 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాల్లో ఎక్కువ ఓట్లు చీలడంతో బీజేపీ గెలిచింది గాని నిజమైన విజయం మాత్రం తేజస్విదే. ఇతనికి ఇపుడే కాదు, ఎప్పట్నుంచో బీహార్ యువతలో మంచి క్రేజుంది.
2015లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తేజస్వి రోడ్లు భవనాలు శాఖ తీసుకుని బీహార్ రోడ్ల గతిని మార్చేశారు. తండ్రి సూచలనతో మంచి అధికారుల టీం పెట్టుకుని… రోడ్ల సమస్య ఎక్కడున్నా నాకు నేరుగా చెప్పండి అని జనానికి వాట్సప్ నెంబరు ఇచ్చాడు. అయితే, అతనికి ఫ్లాటైన బీహారీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల నుంచి 44 వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట. అంత క్రేజుంది కాబట్టి… ఈ స్థాయిలో వెలిగాడు తేజస్వి.
కాంగ్రెస్ తన కూటమిలో ఉండటం ఆర్జేడీని చాలావరకు దెబ్బేయగా… లౌకిక కూటములు 3 ఏర్పాటుకావడం ఓట్లను చీల్చింది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తేజస్వి సీఎం అని ఇప్పటికే బీహారీలు ఫిక్సయిపోయారు.