గ్రేటర్ ఎన్నికల సందర్భంగా…
తెలంగాణ ముఖ్యమంత్రి KCR తో… తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ
ప్రశ్న : దళితుడిని…ముఖ్యమంత్రి ఎందుకు
చెయ్యలేదు…?
జవాబు : 3 ఎకరాలు ఇద్దామని
ప్రశ్న : మరి ఎందుకు ఇవ్వలేదు..?
జవాబు : డబుల్ బెడ్ రూమ్ ఇద్దామని
ప్రశ్న : అది కూడా ఇవ్వలేదు కదా…?
జవాబు : ఇంటికో ఉద్యోగం ఇస్తే..వాళ్ళే
కట్టుకుంటారని ఇవ్వలేదు..
ప్రశ్న : మరి ఉద్యోగాలు కూడా లేవుకదా..?
జవాబు : KG to PG ఇచ్చి…వారికి ట్రైనింగ్ ఇచ్చాక
ఇస్తాం…
ప్రశ్న : ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు…?
జవాబు : బంగారు తెలంగాణా అవగానే…
ప్రశ్న : ఎపుడు అవుతుంది….?
జవాబు : ప్రాజక్ట్ లు… పూర్తవగానే…
ప్రశ్న : ప్రాజక్ట్ లు…ఎప్పుడు పూర్తవుతాయి..?
జవాబు : చంద్రబాబు..కుట్ర చేస్తున్నాడు
ప్రశ్న : మరి…మీరేం చేస్తున్నారు…?
జవాబు : మిషన్ భగీరధ ద్వారా..ఇంటింటికీ నల్లా
ఇస్తున్నాం…
ప్రశ్న : ఎక్కడా రావటం లేదు కదా….?
జవాబు : మిషన్ కాకతీయ…పూర్తవగానే చెరువులు
నిండి…నీరు పుష్కలంగా అందుబాటులోకి
వచ్చాక…
ప్రశ్న : మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేక
పోయారు..?
జవాబు : అక్రమ కట్టడాలు తొలగించాలి….
ప్రశ్న : అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా…?
జవాబు : ఆంద్రోళ్ళు గోలపెడతారని….
ప్రశ్న : వాళ్ళని తెగ తిడుతున్నారు కదా…?
జవాబు : లే..నేనెందుకు తిడతా…నాకేమన్నా
పిచ్చా….వాళ్ళ కాళ్ళలో…ముల్లు
గుర్చుకుంటే పంటితో తీస్తా…..
ప్రశ్న : మరి…వాళ్ళే తెలంగాణా ద్రోహులు
అంటారుగా…?
జవాబు : ఉద్యమం సమయంలో…లక్ష అంటాం..
ప్రశ్న : లక్ష అంటే గుర్తొచ్చింది….రామోజీ పిల్మ్
సిటీని..లక్ష నాగళ్ళతో
దున్నుతామన్నారుగా..?
జవాబు : అన్ని ట్రాక్టర్లు దొరకలా…ఎన్ని ఉన్నాయో
లెక్క వేద్దామని…కొంగరకలాన్ లో మీటింగ్
కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించా….లచ్చ రాలేదు…
ప్రశ్న : మరి తరువాత మీ ప్రోగ్రాం….?
జవాబు : ట్రాక్టర్లు లేకపోతే ఏమయింది…ఇంటింటికీ
బర్రెలు, గొర్రలు ఇచ్చాం….వాటిని అక్కడకి
తోలి రా.పిల్మ్.సిటీని స్వాదీనం
చేసుకుంటాం.
ప్రశ్న : బర్రెలు, గొర్రెలు…ఇవ్వటంలో ఆంతర్యం..?
జవాబు : ఇంకా అర్దం కాలేదా…..హ….హ… 😛😛😛
పైన ప్రశ్నలు సమాధానాలు అన్నీ యధార్థ సంఘటనల ఆధారంగా కల్పించుకుని రాసినవి 😎
వ్యాసకర్త = #శీశేరె..✍✍