ప్రస్తుతం జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. రెండు కీలక విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఒకటి టీడీపీ తనను తాను రక్షించుకునే పనిచేపట్టింది. పార్టీ అధినేతచంద్రబాబు నుంచి యువ నాయకుడు నారా లోకేష్ వరకు అందరిపైనా కేసులు ఉన్నాయి. రేపు ఓడిపోతే.. ఈ కేసులు మరింత ఉచ్చు బిగుసుకుం టాయి. దీనికితోడుక్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో వారు చెలరేగిమరీ ప్రచారం చేసుకున్నారు.
టీడీపీ అధికారంలోకి రాకపోతే.. రేపు తమ పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని లెక్కలు వేసుకున్నారు. ఈ పరిణామాలతో రేపు టీడీపీ కనుక విజయందక్కించుకుంటే.. ఇదే సీన్వైసీపీ లో కనిపించడం ఖాయమని పరిశీలికులు చెబుతున్నారు. అటు అధికారులు.. ఇటు నాయకులు కూడా తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొనక తప్పదని అంచనా వేస్తున్నారు.తమను వేధించిన వారిని.. తమను ఇరుకున పెట్టిన వారిని టీడీపీ వదిలే ప్రసక్తి లేదన్నది కళ్లముందు కనిపిస్తున్నవాస్తవం.
ఇక్కడచిత్రం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కొంతమేరకు..ఈ విజయం పట్టు విడుపులతో వ్యవహరించినా.. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మాత్రం అలా వ్యవహరించే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఈ విషయాన్ని ఆయన పదే పదే అనేక సందర్భాల్లోను.. ఎన్నికల ప్రచారంలోనూ చెప్పుకొచ్చా రు. తాము అధికారంలోకి వచ్చాక.. వడ్డీ, చక్ర వడ్డీతో సహా తీర్చేసుకుంటామని.. అస్సలు రుణం ఉంచుకోబోమని చెప్పారు. దీంతో వైసీపీకి టీడీపీ నుంచి వేట ఖచ్చితంగా ఉంటుంది.
ప్రభుత్వం పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపైనా కేసులు నమోదు కానున్నాయి. రుషి కొండను తొలిచేయడం.. సహా .. అవినీతి, ఇసుక అక్రమాలు వంటి వాటిని టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ చూస్తూ ఊరుకోదు. దీంతో సీఎంజగన్ సహా.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి.. కొడాలి నాని, మంత్రి రోజా వంటి వారికి టీడీపీ చుక్కలు చూపించడం ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ నేతలను జైళ్లకు పంపించడం.. కేసుల్లో ఇరికించడం ఖాయంగా కనిపిస్తోంది.