శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం.. పుట్టపర్తి లో టీడీపీ జెండానే ఎగురుతుందా? ఇక్కడ మళ్లీ పల్లె రఘునాథ రెడ్డికే ప్రజలు పట్టంకట్టేందుకు రెడీ అవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ సీనియర్లు. ఇక్కడ కొన్నాళ్లుగా స్తబ్ధత నెలకొంది. పల్లె రఘునాథరెడ్డి.. మాజీ మంత్రి. 2014లో ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దీనికి ముందు కూడా ఆయన క్రియాశీలకంగానే వ్యవహరించారు. విద్యాసంస్థల అధినేతగా కూడా మంచి పేరు సంపాయించుకున్నారు.
అయితే.. పుట్టపర్తి సీటుపై కన్నేసిన జేసీ బ్రదర్స్.. ఇక్కడ పల్లెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు నిర్వహించా రు. అంతేకాదు.. ఇక్కడ పల్లె కు బలం తగ్గిపోయిందని.. ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారంటూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు.. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. ఇబ్బందులు వచ్చినా.. పల్లె మాత్రం తనపనిని తాను చేసుకుని పోతున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటు న్నారు.
చంద్రబాబు పిలుపు మేరకు ఆయన అన్నికార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై చంద్రబాబు రెండు రూపాల్లో పరిశీలన చేయించినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి ఐటీడీపీ ద్వారా.. రెండో వేరే జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులను ఇక్కడకు పంపించి.. క్షేత్రస్థాయిలో పల్లె పరిస్థితి, పార్టీ పరిస్థితిపైనా అంచనాలు రాబట్టారు.
దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక చంద్రబాబు చేతికి అందిందని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతు న్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పల్లెకు తిరుగులేదని.. ఆయనకు ఉన్న మంచి పేరు.. ప్రజల నేతగా ఉన్న గుర్తింపు వంటివి.. ఇక్కడ మరోసారి పార్టీని భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా అడుగులు వేయిస్తాయని అంటున్నారు. ఈ నివేదికపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, మరో నివేదిక కూడా రావాల్సి ఉందని వారు తెలిపారు