• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోతోంది: పీకే

admin by admin
March 3, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
prashant kishor, chanrababu
0
SHARES
274
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని తెలిపారు. ప్యాల‌స్‌లో కూర్చుని ప‌థ‌కాలు అమ‌లు చేస్తామంటే.. డ‌బ్బులు ఇస్తున్నామంటే కుద‌ర‌ద‌ని.. జ‌గ‌న్ ఓట‌మి త‌థ్య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని తేల్చి చెప్పారు. జగన్ పార్టీ మామూలుగా కాదు, భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని, భారీ తేడాతో ఓడిపోతుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉచితాలు అంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపై సైతం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం పథకాలతో ఓట్లు రాలవని, ప్రజల వద్దకే అన్నీ అందుతున్నాయని చెప్పుకోవడం కాదని అన్నారు.

డెవలప్‌మెంట్ కోసం ముందడుగు వేయాలని, అది జ‌గ‌న్ కు చేత‌కాలేద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. జగన్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేన‌ని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో మార్పు దిశ‌గానే ప్ర‌జ‌లు ఓట్లేస్తార‌ని తెలిపారు. అభివృద్ధి విష‌యంలో చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో దాంతో ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయ‌నుంద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు, ప్రస్తుతం రోజులు మారాయని, యువత అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. వారు ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ది చెందితే జాబ్స్ వస్తాయని వారు కలలు కన్నార‌ని తెలిపారు. కాగా, ఉచితాలపై మాత్రమే ఫోకస్ చేసిన జగన్ కొన్ని విషయాల్లో మిస్టేక్ చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తుందన్నారు. జ‌గ‌న్ ఒక్కరే ఒక వైపు ఉన్నార‌న్న సానుభూతి ప‌నిచేయ‌ద‌ని తెలిపారు.

కాగా, 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక స్థానాలతో విజయం సాధిస్తారన్న పీకే అంచనా నిజమైన విష‌యం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌నే వైసీపీ ఘోరంగా ఓడిపోతుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Tags: ap electionsPKprashant kishoretdp governmenttdp winycp's defeat
Previous Post

జగన్ ఓటమి ఖాయం..రాసి పెట్టుకోండి: పీకే

Next Post

అర్థరాత్రి వేళ బిర్యానీ ఆర్డర్.. లేదంటే కొట్టేశారు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

అర్థరాత్రి వేళ బిర్యానీ ఆర్డర్.. లేదంటే కొట్టేశారు

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra