2024 ఎన్నికలకు దాదాపుగా మరో రెండేళ్ల సమయం ఉంది. ఇది, సగటు ఓటరు మనోగతం. రాబోయే ఎన్నికలకు కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది…ఇది ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడి మనోగతం. అందుకే, ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచి రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలుబెట్టాయి. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చే అవకాశముందంటూ వైసీపీ, టీడీపీ అధినేతలు లీకులిస్తుండడం కూడా చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యే పోల్ వార్ జరగబోతోన్నప్పటికీ…జనసేన-బీజే
రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ నవంబర్ నుంచి బస్సు యాత్ర చేస్తానని ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇక, నాలుగు దశాబ్దాల ఆనవాయితీని పక్కనబెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు…ఇప్పటి నుంచే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం మొదలుబెట్టారు. నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధం కాగా..చంద్రబాబు జిల్లాల పర్యనలతో జనానికి చేరువవుతున్నారు. ఇక, ఏపీ ప్రజలకు మూడో ప్రత్యామ్నాయంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దసరా నుంచి బస్సు యాత్ర చేయబోతున్నారు.
వైసీపీ కొత్త వ్యూహకర్త రిషిరాజ్ ను నియమించుకొని ఎన్నికలకు సిద్ధమవుతుండగా…టీడీపీ కూడా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఒక్క చాన్స్ అంటూ గత ఎన్నికల్లో జనం ముందుకు వచ్చిన జగన్…ఈ సారి నవ రత్నాలు, సంక్షేమ పథకాలను నమ్ముకోవాల్సింది. కానీ, పథకాల అమలులో లోపాలు, ఏపీని వెంటాడుతున్న అప్పులు, పెరిగిన ధరలు జగన్ కు మరో చాన్స్ ఇవ్వకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల ఫలితాన్ని మరచిపోయి…నూతనోత్సాహంతో 2024 ఎన్నికలలో విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. జగన్ పై వ్యతిరేకతను టీడీపీ సానుకూలంగా మలచుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది.
ఇక, ఏపీలో మారుతున్న పరిస్ధితులను బీజేపీ గోడ మీద పిల్లిలా నిశితంగా పరిశీలిస్తోంది. జనసేనానితో తెగదెంపులు చేసుకోకుండా ఒక ఆప్షన్ ను ఓపెన్ గా ఉంచుకుంది బీజేపీ అధిష్టానం. ఇక, పాత దోస్త్ అయిన జగన్ ఎలాగూ కేసుల భయంతో గుప్పిట్లో ఉంటాడు కాబట్టి…ఆ ఆప్షన్ కూడా ఓపెన్ గానే ఉంచుకుంది. మరోవైపు, జగన్ ను జనం వ్యతిరేకించి టీడీపీవైపు మొగ్గితే…చంద్రబాబుతో దోస్తీకి కూడా ఆప్షన్ ఓపెన్ గా పెట్టుకుంది బీజేపీ. ఇందులో భాగంగానే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతుగా చంద్రబాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీకి బీజేపీ నేతలు సోము వీర్రాజు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.