వైఎస్ కుటుంబానికి అత్యంత కీలకమైన కడప జిల్లాలో వైసీసీ కూసాలు కదులుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్లు. కీలకమైన రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ సారి కష్టమే! అంటున్నవారి సంఖ్య అధికార పార్టీలో పెరుగుతుండడం గమనార్హం. అవే.. మైదుకూరు, రాజంపేట. ఈ రెండు కూడా.. గత ఎన్నికల్లోనే కాదు.. మైదుకూరును 2014లోనూ వైసీపీ దక్కించుకుంది.
అయితే. ఇప్పుడు మాత్రం ఈ రెండు కూడా.. టీడీపీ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వీటిలో ఒకటి 2014లో టీడీపీ విజయం దక్కించుకుంది. గత ఎన్నికల్లో రెండు కూడా ఓడిపోయింది. అయితే.. ఇప్పుడు టీడీపీ కడపపై ఎక్కువగా ఫోకస్ చేయడం.. ఇక్కడ అన్నింటా కాకపోయినా.. కనీసం 5 నియోజకవర్గాల్లో అయినా.. పాగా వేయాలని టీడీపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో టీడీపీకి అనుకూలంగా రెండు నియోజకవర్గాలు ఉన్నాయని.. ఇక్కడ గెలుపు ఖాయమని పార్టీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. వీటిలో రాజంపేటలో 2014లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇదీనిని వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకునేదుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. పైగా.. జిల్లా విభజన తాలూకు వేడి ఇంకా తగ్గలేదు. దీంతో మేడా సోదరుడు.. శేఖర్‌రెడ్డి టీడీపీలో చేరిఇక్కడ విజయం దక్కించుకునే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
మేడా శేఖర్‌కు.. చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక, మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్‌పై సింపతీ పెరిగినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వరుస పరాజయాలు ఎదురైనా ఆయన ప్రజలకు చేరువ గా ఉండడంతో.. ఆయన విషయంలో ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరినా చేరకున్నా.. ఆయన ఇక్కడ పార్టీకి గెయిన్ అవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాలు మాత్రం కచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతామని టీడీపీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో మరో రెండు నియోజకవర్గాలపైనా కన్నేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.