• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

admin by admin
March 2, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
250
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తుది శ్వాస విడిచారు. గుండెపోటుకు గురై కొంతకాలంగా విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. రక్తపోటు అదుపులోకి రాక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లుగా తెలుస్తోంది. జనవరి 28న అర్జునుడికి గుండెపోటు రావడంతో వైద్యులు ఆయనకు స్టెంట్ వేసి కొద్ది వారాలుగా చికిత్స అందిస్తున్నారు.

1995 నుంచి రాజకీయాల్లో ఉన్న బచ్చుల అర్జునుడు 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా పని చేశారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

మరోవైపు, బచ్చుల అర్జునుడు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని చంద్రబాబు అన్నారు. నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అర్జునుడి మృతి స‌మాచారం తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యానని లోకేష్ అన్నారు. నిజాయితీకి మారుపేరు, అజాత‌శ‌త్రువుగా పేరున్న అర్జునుడు టీడీపీ బ‌లోపేతానికి ఎన‌లేని కృషి చేశారని కొనియాడారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు, అర్జునుడి మృతికి సంతాపంగా రేపు అమరావతిలో జరగాల్సిన టీడీపీ జోన్ -3 సమీక్షా సమావేశం వాయిదా వేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Tags: bachula arjunuduChandrababucondolencesdiedLokeshtdp mlc batchula arjunudu
Previous Post

జైలు మొనగాడు జగన్ కు చేతనైందొక్కటే..లోకేష్

Next Post

కేసీఆర్ పై లేడీస్ సెంటిమెంట్ ప్రయోగించిన రేవంత్

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post
revanth reddy

కేసీఆర్ పై లేడీస్ సెంటిమెంట్ ప్రయోగించిన రేవంత్

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra