2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించిన నా సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత కూడా సత్సంబంధాలు కొనసాగించారు. అయితే, తమ ఐదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం కాగా, సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాజాగా ఆ ఇద్దరు 2023, 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఇద్దరిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఫామ్ హౌస్, ప్యాలెస్ లకే పరిమితమయ్యారని సోమిరెడ్డి పంచ్ లు వేశారు. గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంతల మాదిరి వీరిద్దరూ వ్యవహరించారని ఆరోపించారు.
కానీ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని అన్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో ఈ ఇద్దరు ముఖ్యమంత్రలు చర్చలు జరపబోతున్నారని, రాబోయే రోజుల్లో తెలుగు జాతికి నిండు వెలుగులు రావడం ఖాయమని సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ లను ఉద్దేశించి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.