వస్తారా.. రారా.. అన్న అనేక సందేహాలు.. అనుమానాల మధ్య వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెం బ్లీకి వచ్చారు. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలిరోజు.. జగన్.. తన 11 మంది ఎమ్మెల్యేల తో కలిసి సభకు చేరుకున్నారు. అయితే.. చిత్రంగా సభలోనూ..జగన్ పట్టుమని 11 నిమిషాలు కూడా లేరంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇక, జగన్ మ్యాగీ పొయ్యి మీద పెట్టి వచ్చారని, అందుకే, ఇలా వచ్చి అలా రెండు నిమిషాల్లో వెళ్లిపోయారని టీడీపీ సీనియర్ ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చురకలంటించారు.
చంద్రన్న చిరునవ్వులు
సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు ప్ర ధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ.. ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో జగన్ కూడా.. తనకు కేటా యించిన సీట్లో నిలబడి.. ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు. ఈ సమయంలో సభా నాయకుడి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తతంగాన్ని చూసి, చిరునవ్వులు చిందించారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఏపీ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ సమయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు నవ్వడం ఆసక్తి రేకెత్తిం చింది. గత శాసనసభలో జరిగిన ఘటనలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల చర్యలను దుయ్యబట్టారు.
గత శాసనసభలో 23 మందికే పరిమితమైన టీడీపీని.. ఇదే అసెంబ్లీలో వైసీపీ అవమానించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబును గేలి చేసిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు.. పాత వీడియోల ద్వారా మీడియాకు మరోసారి గుర్తు చేయడం గమనార్హం.