వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీ పీ డిమాండ్ చేసింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. “నిబంధనలు పాటిస్తూ.. ఎన్నికల సంఘం చెప్పినట్టు చేసే ఏజెంట్లు తమకు అవసరం లేదని సజ్జల చెబుతున్నారు. ఇలాంటి వారిని తక్షణమే అరెస్టు చేయాలి. లేకపోతే.. కౌంటింగ్ సజావుగా సాగే పరిస్థితి ఉండదు“ అని టీడీపీ హెచ్చరించింది. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం తాత్సారం చేయరాదని కూడా పార్టీ వ్యాఖ్యానించింది.
మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల రామకృష్నారెడ్డిపై ఫైర య్యారు. “వాళ్లకు రూల్స్ పట్టవు. ఎన్నికల సంఘానికి ఇలాంటి వాళ్లు పట్టరు. అసలు సజ్జల ఏమనుకుం టున్నాడు. కౌంటింగ్ అంటే.. ఏమనుకుంటున్నాడు. తన వారిని పెట్టుకుని తన ఇష్టానుసారంగా.. కౌంటింగ్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి వాళ్లను తక్షణమే అరెస్టు చేసి బొక్కలో వేయాలి“ అని ఉమా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
సజ్జలకు వంత పాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కూడా.. తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని దేవినేని డిమాండ్ చేశారు. జవహర్ రెడ్డి సహకారంతోనే వైసీపీ ఆటలు సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే పదవికి జవహర్ రెడ్డి మాయని మచ్చగా మారారని దుయ్యబ ట్టారు. ఆ పదవి నుంచి తప్పించాలని ఉమా డిమాండ్ చేశారు. “ఓటమి భయంతో కౌంటింగ్ రోజున వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నిక లసంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఆయనకు సహకరిస్తున్న జవహర్‌రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి“ అని ఉమా డిమాండ్ చేశారు.