భారత దేశంలోనే గంజాయి సరఫరాలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచి అపఖ్యాతి పాలైన సంగతి తెలిసిందే. ఉడ్తా పంజాబ్ తరహాలో మన రాష్ట్రం కూడా ఉడ్తా ఏపీగా మారిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2021లో పట్టుబడ్డ హెరాయిన్, గంజాయిల నిల్వలలకు సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో జగనన్న పాలనలో ఉనన్ ఏపీ అగ్రస్థానంలో నిలిచి అవమానాన్ని మూటగట్టుకుంది.
2021లో దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల కిలోల గంజాయిని పట్టుకుంటే…అందులో ఏపీ వాటా 26 శాతం ఉండడంతో సగటు ఆంధ్రప్రదేశ్ వాసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించిందీ ప్రభుత్వం. దేశంలో సరఫరా అవుతోన్న గంజాయిలో 50 శాతానికి పైగా ఆంధ్రా, ఒడిస్సాల నుంచే సాగవడం షాకింగ్ గా మారింది. జగన్ పాలనలో ఏపీలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా సాగుతోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించినా…ఫలితం లేకపోయింది.
ఈ నేపథ్యంలోనే గంజాయాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చిన జగన్ ను టీడీపీ నేతలు సన్మానించారు. కేక్ కటింగ్ చేసి మరీ జగన్ కు తినిపించి సెటైరికల్ గా నిరసన తెలిపారు. టీడీపీ నేత ఆనం వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతోనే నేడు ఏపీ గంజాయి వాడకంలో నెం.1గా నిలిచిందని ఎద్దేవా చేశారు.
ఇకపై అయినా జగన్ కళ్లు తెరిచి గంజాయి పంట, నిల్వలు, రవాణా వంటి విషయాలపై ఫోకస్ చేయాలని, గంజాయిని రూపుమాపాలని డిమాండ్ చేశారు. గంజాయి రవాణాలో జగన్ సాధించిన ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశామని, ఆయన ఫొటోకు కేక్ తినిపించామని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.