• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సాయిరెడ్డి గుట్టురట్టుకు బుద్ధా వెంకన్న డెడ్ లైన్…సంచలన వ్యాఖ్యలు

admin by admin
April 10, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
241
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చవక ధరకు భూములు కొని…దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపించారు. ఆ భూములన్నీ వైసీపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని, ఎన్‌సీసీ భూముల కేటాయింపు వైసీపీ హయాంలో జరగలేదని చెప్పారు. వైసీపీకి, జగన్ కు, తనకు, తన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా రుషికొండ భూకబ్జాల పేరిట ఓ వర్గం మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశానని అన్నారు.

ఈ క్రమంలోనే విజ‌య‌సాయిరెడ్డికి టీడీపీ కీల‌క నేత బుద్ధా వెంక‌న్న స‌వాల్ విసిరారు. విజయసాయిరెడ్డి దోచుకున్న భూములన్నీ సర్వే నంబర్లతో సహా నిరూపిస్తానని, విశాఖలోని జగదాంబ సెంటర్ లో  ఏప్రిల్ 21న బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.  సర్వే నెంబర్లతో సహా వైజాగ్ పార్టీ ఆఫీసులో నిజాలు వెల్లడిస్తానని, దమ్ముంటే తనను ఆపాలంటూ సాయిరెడ్డికి స‌వాల్ విసిరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిపై వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాంధ్రకు మంత్రి అని ఫీలవుతున్న విజయసాయిరెడ్డి…ఆ ప్రాంతానికి శనిలా దాపురించాడని వెంకన్న ఆరోపించారు. విజయసాయిరెడ్డి గజదొంగ, నరరూప రాక్షసుడు, విదేశాల్లో అయితే విజయసాయిని బహిరంగంగా ఉరి వేసేవారంటూ బుద్దా వెంకన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వైజాగ్ ను విజయసాయి దోచుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో భూములను బినామీలతో కాజేస్తున్నాడని ఆరోపించారు. రూ.1500 కోట్ల విలువైన ఎన్సిసి భూములను రూ.200 కోట్ల రూపాయలకే బినామీలతో దోచేశాడని ఆరోపించారు. విజయసాయి డబ్బులు మాత్రమే తింటున్నాడంటూ సంచలన విమర్శలు చేశారు.

ఉత్తరాంధ్రలో వీజే ట్యాక్స్ వేస్తున్న సాయిరెడ్డిని చూసి రాష్ట్రమంతా వణికిపోతున్నారని దుయ్యబట్టారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ స్థలాన్ని సైతం వైజాగ్ ఎంపీ దోచుకున్నాడని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉత్తరాంధ్ర ప్రజలు విజయసాయిరెడ్డికి దేహశుద్ధి చేయటం‌ ఖాయమని జోస్యం చెప్పారు. బొత్స సత్యనారాయణను డమ్మీని చేసీ.. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఏ2 సాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 16 నెలలపాటు జగన్, సాయిరెడ్డిలు జైలులో క్లాస్ మేట్స్ అని, అందుకే సమానంగా పంచుకుంటున్నారని ఆరోపించారు.

విజయసాయి రెడ్డి నువ్వు దోచుకున్న భూములన్నీ సర్వే నంబర్లతో సహ ఏప్రిల్ 21 న విశాఖలోనే నిరూపిస్తా.. దమ్ముంటే ఆపు .. @VSReddy_MP pic.twitter.com/prhdwJ1lFj

— Budda Venkanna (@BuddaVenkanna) April 9, 2022

Tags: buddha venkanna challengebuddha versus vijaya saimp vijaya sai reddyshocking allegationstdp leader buddha venkanna
Previous Post

#RRR: దేశ సినీ చరిత్రలో ఈ రికార్డు రాజమౌళికే సొంతం

Next Post

బూతుల మంత్రిని కొనసాగించి ఆ మహిళా మంత్రిపై వేటేస్తావా జగన్?: వర్ల రామయ్య

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

బూతుల మంత్రిని కొనసాగించి ఆ మహిళా మంత్రిపై వేటేస్తావా జగన్?: వర్ల రామయ్య

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra