నీళ్లు లేని గ్రామం అది. కన్నీళ్లే వాళ్లకు మిగులుస్తున్న కాలం ఇది. వేసవిలో సర్కారు చేయాల్సిన పనులా చేయలేదు. ఎందుకంటే నిధుల్లేవు. కనీసం గొంతెండుతున్న పల్లెకు కాస్తయినా ఊరట ఇచ్చేలా వాటర్ ట్యాంకర్లనూ పంపలేదు. కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న తెలుగుదేశం పెద్దాయన స్పందించి మంచి మనసు తనదని చాటుకున్నారు. ఆ వివరం ఈ కథనంలో…
తెలుగుదేశం పార్టీ ఓ గొప్ప సాయం చేసి ఓ గ్రామాన్ని ఆదుకుంది. కడప జిల్లాలో తాగునీటికి అల్లాడిపోతున్న గ్రామాన్ని ఆదుకుని మానవత్వం చాటుకుంది. దీంతో ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తాగునీటి పథకాల నిర్వహణకు కనీస స్థాయిలో నిధులు ఇవ్వలేక అల్లాడిపోతున్న వైఎస్ జగన్ సర్కారుకు ఈ చర్య ఏ విధంగా అర్థం అవుతుందో తెలియదు కానీ విపక్ష పార్టీ టీడీపీ చేసిన సాయం తాము మరువలేమని ఆ గ్రామస్థులు చేతులెత్తి మొక్కుతున్నారు ఆ దాతకు.. ఆ వివరం ఎలా ఉందంటే.
వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం మండలం, గోపాలపురం గ్రామ ప్రజలకు ప్రభుత్వం తాగునీరు అందించలేకపోయింది. కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ వెంటనే స్పందించి ప్రజలకు నీళ్ల ట్యాంకర్లను పంపించి ఆదుకున్నారు. గ్రామ ప్రజలకు ఎన్ని నీటి ట్యాంకర్లు అవసరమైనా పంపిస్తానని… ఇతరత్రా ఏ సమస్య వచ్చినా తాను ఆదుకోవడానికి అన్నివేళలా సిద్ధంగా ఉంటానని సాయినాథ్ శర్మ భరోసా ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం చెయ్యడం తెలుగుదేశం నేతలకే సాధ్యం అని ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధినాయక వర్గాలు కూడా కాశీభట్ల మంచితనాన్నీ, సాయం చేసే గుణాన్నీ ప్రశంసిస్తోంది.
కడప జిల్లాలో చాలా ప్రాంతాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. వేసవి లో చుక్క నీరు దొరకని ప్రాంతాలూ ఉన్నాయి. రెండు, మూడు రోజులకు ట్యాంకర్లు వచ్చినా కూడా సమస్య తీరడం లేదు. ఈ తరుణంలో టీడీపీ స్పందించింది. సహృదయత చాటుకుంది. ఇదే విధంగా మిగతా ప్రాంతాల్లో నాయకులు కూడా ప్రజా సమస్యలపై సత్వర కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తే ప్రజా మన్ననలు పొందడం ఖాయం.