• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ విషయంలో మోడీని ఏకిపారేసిన కేసీఆర్

admin by admin
June 2, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్…మోడీపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని అన్నారు.

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ప్రధానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా…ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డుపడినా…రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు.

ఐదేళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేసిన కృషిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇటీవల ప్రశంసించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కావాలనే కేంద్రం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. రైతులు భిక్షగాళ్ళు కాదని.. రైతులతో పెట్టుకోవద్దని మరోసారి కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోందని మండిపడ్డారు.

బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో మోడీ ముందుకెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు  కేంద్రం పాల్పడుతోందన్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణ వల్ల తెలంగాణ ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు.

Tags: cm kcrkcr comments on modikcr slams modipm moditelangana formation day
Previous Post

జ‌గ‌న్ ఊరికి టీడీపీ నీళ్లు ….వావ్ వావ్

Next Post

జగన్ కు కొత్తపల్లి అల్టిమేటం…వైసీపీలో మరో రె‘బెల్’

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

జగన్ కు కొత్తపల్లి అల్టిమేటం...వైసీపీలో మరో రె‘బెల్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra