టీడీపీ-జనసేన తొలి సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనం
చంద్రబాబు, పవన ప్రసంగాల సమయంలో జన హోరు
దాదాపు ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనపై సామన్యుడి నెత్తురు మరుగుతున్న వేళ.. టీడీపీ-జనసేన ఎత్తిన జెండా రెపరెపలాడుతూ ఎగిరింది!
రెండు పార్టీలూ కలిసి తొలిసారిగా ఉమ్మడిగా నిర్వహించిన ‘జెండా’ సభ సూపర్ డూపర్ హిట్టయింది!!
ఎప్పటిలాగా అధికార పార్టీ కుళ్లుబోతుతనం ప్రదర్శించి బస్సులు ఇవ్వకపోయినా.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జనం ‘జెండా’ సభకు వెళ్లకుండా ఆపడానికి విశ్వప్రయత్నాలు చేసినా.. ఉపయోగం లేకపోయింది.
వారికి ఉక్రోషమే మిగిలింది. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని ప్రతిపాడులో నిర్వహించిన.. ఈ ‘తెలుగు-జన విజయకేతనం జెండా’ సభకు లక్షలాదిగా జనం పోటెత్తారు!
సర్కారు బస్సులు ఇవ్వకపోతేనేం.. సొంత కార్లు, వాహనాల్లో వచ్చారు. సభదాకా వాహనాలు వెళ్లకపోతే కిలోమీటర్ల కొద్దీ నడిచి చేరుకున్నారు.
పసుపు, ఎరుపు జెండాలతో మండుటెండలో సైతం సందడి చేశారు.
రాత్రి పొద్దుపోయే దాకా.. ఆలోచన రేకెత్తించేలా సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని, రక్తం మరిగించేలా, ఉర్రూతలూగించేలా సాగిన పవన ప్రసంగాన్ని ఆసాంతం వినేదాకా కదలకుండా సభలోనే కూర్చున్నారు!
అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ జిల్లాల దాకా.. మూడు లక్షల మందికిపైగా ఈ సభకు వచ్చినట్టు అంచనా.
చంద్రబాబు ప్రసంగం పూర్తవగానే పవన వచ్చి ఆయన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు సభ మొత్తం జయజయధ్వానాలతో ఊగిపోయిందంటే అతిశయోక్తి కాదు.
ఇది మామూలు సభ కాదు. రావణ, జరాసంధ, కీచక యంత్రాంగంతో ప్రజలను నరకయాతన పెడుతూ దారుణమైన పాలన సాగిస్తున్న అధికార పార్టీకి ముచ్చెమటలు పోయించిన సభ.
వచ్చే ఎన్నికల్లో పసుపు-ఎరుపు జెండాదే రాజ్యమని లక్షలాది గొంతుకలతో చాటి చెప్పిన సభ.
పాపాత్ముడి పాలన పోయే శుభఘడియలు వస్తున్నాయని సూచించిన సభ.
ఆంధ్రప్రదేశ ఊపిరి పీల్చుకో.. అమరావతీ ఊపిరి పీల్చుకో.. ఆయన వస్తున్నాడు!!