తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ ఈ రోజు టీడీపీ-జనసేన కూటమి తరఫున అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి 118 మంది అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలతోపాటు 3 లోక్ సభ స్థానాలు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. బీజేపీతో పొత్తు చర్చల తర్వాత మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేశ్, కుప్పం నుంచి తాను, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి పూసపాటి అదితి గజపతి రాజు పోటీ చేయబోతున్నారని తెలిపారు. వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, వైజాగ్ వెస్ట్ పీజీబీఆర్ నాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత ,నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత మిగతా అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలలో 5 స్థానాల తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేనకు మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలు కేటాయించారు. వాటిలో 5 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
కాకినాడ రూరల్ – నానాజీ పంతం
నెల్లిమర్ల-లోకం మాధవి
తెనాలి-నాదెండ్ల మనోహర్
అనకాపల్లి-కొణతాల రామకృష్ణ
రాజానగరం-రామకృష్ణుడు