టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే, మగాడైతే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లోకేష్ పై పిన్నెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి పై పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ చార్జిలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి మాచర్ల ఎమ్మెల్యే పిచ్చికుక్కలా మొరుగుతున్నారని, 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని మాచర్ల టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ల స్థాయితో పోలిస్తే మాచర్ల సన్నాసి నువ్వు ఎంత? నీ బతుకెంత అంటూ విమర్శలు గుప్పించారు. నువ్వు ఒక విగ్రహాల దొంగవని, మాచర్ల ప్రజలకు నీ బతుకంతా తెలుసని సంచలన విమర్శలు చేశారు.
ఇక, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతిని మాత్రమే లోకేష్ ప్రస్తావించారని, అసభ్యకరంగా మాట్లాడలేదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుని బంగాళాఖాతంలో పడేయాలి, కాల్చి చంపాలి అని జగన్ అన్న భాష రామకృష్ణారెడ్డికి నచ్చిందని, కానీ, లోకేష్ హుందాగా మాట్లాడితే నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ తమకు లక్ష్మణ రేఖ గీసిందని, ఆ రేఖ దాటితే పిన్నెల్లి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదని వార్నింగ్ ఇచ్చారు.
సభ్యత సంస్కారంతో మాట్లాడితే మంచిదని, పిన్నెల్లికి దమ్ముంటే లోకేష్ ఆరోపణలపై బ్రహ్మారెడ్డితో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. పిన్నెల్నిని ఓడించేందుకు లోకేష్ అవసరం లేదని, జూలకంటి బ్రహ్మారెడ్డి చాలని అన్నారు. లోకేష్ ను విమర్శించే స్థాయి పిన్నెల్లిది కాదని అన్నారు.
వైసిపి ఎమ్మెల్యేలను ఆంబోతుల మాదిరి జనం పైకి జగన్ వదిలేశారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. జగన్ అండతో కోట్ల రూపాయల కొల్లగొట్టిన పిన్నెల్లి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు పిన్నెల్లి కూడా ఈసారి వార్డు మెంబర్లుగా కూడా గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.