చివరకు చంద్రబాబు మౌనమే తనకు మేలు చేసింది. చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఇటీవల పర్యటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలు త్వరలో కొత్త కూటమికి ఆస్కారం ఉందని వార్తలు వచ్చాయి.
అయితే కేవలం ఏదో మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశారని 75 సంవత్సరాల వేడుకలకు మాత్రమే పిలిచారని కొందరు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని ఢిల్లీ పత్రికల్లో ఇటీవలే పొత్తు కుదరవచ్చని, టీడీపీ బీజేపీ ఏకం కావచ్చని కథనాలు ప్రచురించాయి. అయితే కూడా ఏదో టీడీపీ పీఆర్ అని కొట్టిపారేశారు.
కట్ చేస్తే… ఇపుడు ఏకంగా మోడీ ఆత్మగా భావించే రిపబ్లిక్ ఛానెల్ ఇద్దరు పొత్తు ఖాయమని తేల్చేసింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి), 4 సంవత్సరాల తరువాత, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే ) లోకి తిరిగి రాబోతున్నట్లు ఛానెల్ లో బిగ్ బ్రేకింగ్ అంటూ కథనాలు వచ్చాయి.
ఎన్డీయేలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రాష్ట్రాలలో పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి నాయుడుతో ఇటీవల భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉండడంతో టీడీపీతో పొత్తుపై బీజేపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత రెండేళ్లు కేసీఆర్ తో నడిచిన టీడీపీ ఓటు బ్యాంకు కూడా తిరిగి ప్రత్యామ్నాయం చూస్తున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు తమకు లాభించే అవకాశం ఉందని బీజేపీ భావించడమే ఈ పొత్తుకు ప్రధాన కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
2019లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీ, బీజేపీలు విడిపోయాయి. జగన్ పన్నిన ట్రాప్ లో పడి చంద్ర బాబు మోడీకి దూరం అయ్యారు. అప్పట్లో మోడీ వద్దన్నా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. తర్వాత తీరిగ్గా బాధపడాల్సి వచ్చింది. ఇపుడు మళ్లీ జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం ద్వారా తన పరువును పూర్తిగా పోగొట్టుకున్నాడు. జగన్ పై ఏపీ లో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఏపీ అప్పులపాలై దేశం పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఏపీ ఆదాయం 60 వేల కోట్లుండగా కట్టాల్సిన వడ్డీ 50 వేల కోట్లుంది. దీంతో దివాలాకు ఏపీ అతి సమీపంలో ఉంది. ఈనేపథ్యంలో జగన్ తో ఉంటే ఏపీకి, దేశానికే కాదు బీజేపీకి కూడా నష్టమే అని భావించడంతో మోడీ రూటు మర్చాడు. అది చివరకు టీడీపీ బీజేపీ పొత్తుగా మారనుంది.
Comments 1