తెలుగు సినిమా పరిశ్రమపై జగన్ మోహన్ రెడ్డి పగబట్టారు.
వారికి అడిగినవన్నీ ఇచ్చి మర్యాదగా చూసుకున్న చంద్రబాబుపై నానా విమర్శలు చేసిన సినిమా వాళ్లు జగన్ ఇపుడు వారిని వేటాడుతున్నా, రక్త కన్నీరు తెప్పిస్తున్నా సైలెంటుగా ఉన్నారు.
మాట్లాడితే ఎక్కడ జగన్ అభిమానులు కొడతారో అని, ఏదో ఒక కేసు కింద ఏపీ జైల్లో వేస్తారేమో అని తెలుగు సినీ జనం వణికిపోతున్నారు.
జగన్ సర్కారు సినిమా పరిశ్రమ గొంతు నులుముతున్నా సినిమా పరిశ్రమకు జగన్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని తెలుగు సిని పెద్దలు అని చెప్పుకునే కొందరు పిరికి వాళ్ల వ్యాఖ్యలు వింటుంటే వారిపై జాలి పడాల్సిన వారు కూడా వీరికి జగన్ తగిన శాస్తి చేస్తున్నాడని భావించే పరిస్థితి వస్తోంది.
గుడిలో ప్రసాదం సహా ప్రతి ఒక్క రేటు పెంచిన జగన్ సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే ఎందుకయ్యా తగ్గించావు అని అడిగే ధైర్యం పరిశ్రమలో ఒక్కడికీ లేదు.
నీకు దమ్ముంటే కరెంటు బిల్లు తగ్గించు
బస్సు ఛార్జీలు తగ్గించు
నూనె ధరలు తగ్గించు
ఇంటి పన్నులు తగ్గించు
అని అడగగలిగిన దమ్ము సినిమా పరిశ్రమలో ఎవ్వరికీ లేదు.
భయం… వెన్నులో వణుకు జగన్ అంటే. కోరి కోరి పొగిడి మరీ తెచ్చుకున్న ముఖ్యమంత్రి కదా ఆ మాత్రం భయం లేకుండా ఎలా ఉంటుంది.
మొన్న పవన్ కళ్యాణ్ అందరి కోసం మాట్లాడితే మాకేం సంబంధం లేదు అన్నట్లు అందరూ పవన్ ని తప్పుపట్టారు.
ఇపుడు ఏకంగా బాహుబలి కలెక్షన్లకు తగినంత పన్ను కట్టలేదు. దర్యాప్తు చేసి కక్కిస్తాం అని ఏపీ సర్కారు సలహాదారు సజ్జల సంచలన ప్రకటన చేశారు.
ఇపుడు అయినా ఏ సర్కారు తమకు మంచిదో టాలీవుడ్ కు అర్థమైందో లేదో మరి.
https://twitter.com/PeopleTVNW/status/1443059211168976898