లక్ష రూపాయల స్కాలర్ షిప్‌ల పంపిణీ
ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆదుకోవడానికి ‘తానా’ జాయింట్ ట్రెజరర్ ‘వెంకట్ కోగంటి’ ముందుకు వచ్చారు. ‘తానా’ ఫౌండేషన్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘తానా’ చేయూత కార్యక్రమం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. దాదాపు 8 మంది విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్ షిప్‌ను ఆయన బహుకరించారు.
ఖమ్మంలోని ‘డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్’ ద్వారా ఈ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, ‘తానా’ ఫౌండేషన్ ట్రెజరర్ శశికాంత్ వల్లేపల్లి మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక లేమితో చదువుకు స్వస్తి పలకరాదన్న ఉద్దేశ్యంతో ‘తానా’ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ‘తానా’ అధ్యక్షులు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ కమ్యూనిటీకోసం, విద్యార్థులకోసం పలు కార్యక్రమాలను చేస్తోందన్నారు. ‘తానా’ మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు చేయూతను అందించడం సంతోషకరమైన విషయమని, విద్యార్థులకు స్కాలర్ షిప్‌ను ఇవ్వడంలో ముందుకు వచ్చిన ‘వెంకట్ కోగంటి’ని అభినందించారు.
ఖమ్మం రెండవ పట్టణ సిఐ తుమ్మా గోపి, డిఎన్ఎఫ్ బాధ్యులు బోనాల రామకష్ణ, బండి నాగేశ్వర రావు ఈ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు.