ప్రతిభ ఉన్నప్పటికీ ,చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆదుకోవడానికి ‘తానా’ ప్రస్తుత జాయింట్ ట్రెజరర్ ‘వెంకట్ కోగంటి’ ముందుకు వచ్చారు.
‘తానా’ చేయూత కార్యక్రమం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు 1,15,000 రూపాయిల విలువైన స్కాలర్ షిప్లను తన మిత్రబృందం మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కృష్ణా జిల్లాలోని ‘కంచికచర్ల ‘లో జరిగిన ఒక కార్యక్రమం లో స్థానిక పోలీస్ అధికారుల ద్వారా అందచేశారు
‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, ‘తానా’ ఫౌండేషన్ ట్రెజరర్ శశికాంత్ వల్లేపల్లి ‘ మరియు ‘తానా’ మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి అమెరికా నుండి జూమ్ కాల్ ద్వారా సందేశం ఇస్తూ ,ప్రతిభ కలిగిన విద్యార్థులకు ‘చేయూతను’ అందించడం సంతోషకరమైన విషయమని, విద్యార్థులకు స్కాలర్ షిప్ను ఇవ్వడంలో ముందుకు వచ్చిన ‘వెంకట్ కోగంటి’ని అభినందించారు.
స్కాలర్షిప్లను అందుకొన్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు వెంకట్ కోగంటి’ కి కృతఙ్ఞతలు తెలిపారు.
వీరా రావు కోగంటి ఈ కార్యక్రం ని పర్యవేక్షించారు. స్థానిక మిత్రులైన నరసింహ,అంజి ,మల్లేశ్వర రావు ,శ్రీనివాస్ మరియు విద్యా సాగర్ సహాయ సహకారాలు అందచేసారు .