• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ లో మూడు ముక్కలాట-3

అయోమయంలో "అట్లాంటా బ్రదర్స్"- ఘనత బాలట్ కలెక్షన్ల వరకే!!

admin by admin
February 10, 2023
in TANA Elections
0
0
SHARES
76
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘తానా’లో మూడు వర్గాల మధ్యన మూడు ముక్కలాటలో అట్లాంటా బ్రదర్స్ వర్గం అస్త్ర సన్యాసం చేసి నట్లే అగుపిస్తోంది. పాలనలో తగు అనుభవము లేక,  సీనియర్ల సలహా సహకారాలు పొందాలనే ఆలోచన లోపించి, కలసి గెలిచిన స్వంత టీంని కూడా సమన్వయపరచుకోలేక పోవడమేగాక వారినే బద్ద శత్రువులుగా మార్చుకొని అభద్రతాభావంతో పాత శతృవులను మిత్రులుగా మార్చుకునే క్రమంలో వేస్తున్న తప్పటడుగులు వారికి తప్ప ప్రతిఒక్కరికీ క్రమంగా తెలిసిపోతూంది. ముఖ్యంగా గత ఎన్నికలలో తమ చిత్ర విచిత్ర మాయోపాయాలతో ముప్పుతిప్పలుపెట్టి ఓడించిన పాత అధిష్టానం ప్రాపకంలోకే మళ్ళీ క్రమ క్రమంగా మారుతుండడం తమ వర్గంలోని మిత్రులకే సరిపడక అంతర్మధనం చెందడం ఇబ్బందికరంగా మారేటట్లుగానే ఉంది. మరికొంతమందైతే బలమైన ధృతరాష్ట్ర కౌగిలిలోకి తెలిసి తెలిసి వెళుతున్నారా లేక అక్కడకూడా తమ టక్కుటమార విద్యలతో బురిడీ కొట్టించగలమనే భ్రమలతో వెళుతున్నారా అని సందేహ పడుతున్నారు.

తమ పదవీ కాలం అంతములో జరపాల్సిన అత్యంత ప్రతిష్టాకరమైన ‘తానా’ కాన్ఫరెన్స్ విషయములో స్థలం, సమయం, నాయకత్వం వంటి  తగు నిర్ణయాలను తీసుకునే ఆలోచన పదవీకాలం ప్రారంభంరోజునుంచీ చేయాల్సివుండగా అనాలోచితంగాను, అలసత్వంతోనూ కాలాన్ని హరించి  హడావుడి గా ఎక్కడో, ఎప్పుడో, ఎవరిదో నాయకత్వంలో  చేయవలసి రావడం తలవంపులు తెచ్చేటట్లుగానే ఉంది. ‘తానా’ తరువాతి కాన్ఫరెన్స్ ను 2023 జులై రెండవ సాధారణ వారాంతంలో ఫిలడెల్ఫియాలోని ఒక కన్వెన్షన్ సెంటర్లోని సగ భాగం లో గత ఎన్నికలలో తమ ప్రత్యర్థి ప్యానెల్లో పోటీచేసిన నాయకుని సారధ్యంలో చేయవలసి రావడం పై చాలామంది పెదవి విరుస్తున్నారు. అయితే ‘తానా’ కాన్ఫెరెన్సును అట్లాంటా గాక మరెక్కడో చేస్తారనే  విషయాన్ని ‘నమస్తే ఆంధ్ర’ గత ఎన్నికలముందే ఊహించి చెప్పిందని చాలామందికి  గుర్తు ఉందనుకుంటున్నాము.

ముఖ్యంగా అట్లాంటా మొత్తం తమ గుత్తాధిపత్యం అని ఘంటాపధంగా పలుమార్లు వ్యక్తీకరించి తేదీలు దొరకక అట్లాంటాలో చేయలేకపోతున్నాం అని తేలికగా చెప్పటాన్ని సందేహాత్మకంగా పలువురు భావిస్తున్నారు. ఫిలడెల్ఫియా లో కూడా జులై లాంగ్ వీకెండ్ అయిపోయిన తరువాతి సాధారణ వారం, అది కూడా బెంగాలీ కాన్ఫరెన్స్ జరుగుతున్న చోట మిగిలిన సగ భాగం లోమాత్రమే జరుగుతుందంటున్న కారణం గా ఈ మాత్రం దానిని ఇప్పటికైనా అట్లాంటాలో చేయడం సాధ్యమేనని పలువురు భావిస్తున్నారు. అంటే ఈ నిర్ణయాన్ని రాజకీయ లాభంకోసంగానీ లేదా బాధ్యతల్ని భుజాలపైనుంచి తప్పించుకోవటానికి గానీ చేస్తున్నట్లుగా ఎక్కువమంది భావిస్తున్నారు. పైగా సంస్థలోని వర్గాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణ పూరిత  వాతావరణంలో  వీరు చెపుతున్న 3.5 మిలియన్ డాలర్స్ బడ్జెట్ భాద్యత ప్రస్తుతానికి తమ భుజాలపై మోయడం కంటే కాన్ఫరెన్స్ నాయకత్వం కోసం ఉర్రూతలూగుతున్న వేరే వర్గంవారికి అప్పజెప్పడం రిలీఫ్ గా భావిస్తూండవచ్చును. కాన్ఫరెన్స్ నిర్వహణలో వచ్చే నష్టం ఏదైనా ఉంటె ఈ రెండు వర్గాలు కలిస్తే గెలుస్తుందేమో అనుకుంటున్న తరవాతి  ‘తానా’ కార్యవర్గానికి బదలాయించడమే అంతర వ్యూహమని కూడా అట్లాంటాలో కొన్నివర్గాలు గుస గుస లాడుకుంటున్నారు. ఈ విషయయాల్ని బ్రదర్స్ పల్లకీలను పలు సంవత్సరాలుగా మోస్తున్నఅనేకమంది గమనించి  పల్లకీలను దింపి భుజాల నొప్పి నివారణకై ఉచిత  పైయిన్ కిల్లర్లకోసం “తామా(అట్లాంటా స్థానిక తెలుగు సంస్థ)”  వారి క్లినిక్ వద్ద క్యూలే  కడుతున్నారు. ఇక ఈ పల్లకీల బరువు మాని స్వంతపనులు చూసుకోండని ఇస్తున్న పెద్దల కూడా సలహాలు పాటించేటట్లే ఉన్నారు

ఇక గత జనవరి లో ఒకరిని ఒకరు పడదోసుకుని ఎన్నికల ప్రయోజనం కొరకు పోటీలు పడి  రెట్టింపు చేసిన సభ్యత్వాల పరిశీలన వచ్చే ఎన్నికల్లో ఓటుహక్కు పొందటానికి చట్టపరంగా ఉన్న ఏప్రిల్ 30 దాటిపోయిన 45 రోజుల తరువాత పూర్తి అయిన కారణంగా కార్యవర్గాల్లో రసాభాస నడుస్తోంది. సంస్థ బై లాస్ లే లక్ష్మణ రేఖగా భావిస్తూ సంరక్షించాల్సిన ‘తానా’ బోర్డు చట్టవ్యతిరేకంగా ఓటు హక్కు ఇవ్వడానికి ప్రయత్నించి చట్టపరంగాను, కోర్టుల పరంగాను, పబ్లిక్ పరంగాను అభాసు పాలు కావడానికి సాహసించదని పలువురు అనుకుంటున్నారు. ఇదే బై లాస్  విషయమైనే కదా ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటీ తో గెలిచినప్పటికీ జయ్ తాళ్లూరి పదవీకాలం పొడిగింపుకు మోకాలడ్డి తమ దాకా వస్తే తూచ్ అని కొందరంటున్నారు అని వారిలో వారు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఈ విషయము చిలికి చిలికి తుఫాను గా మారి కోర్ట్ గుమ్మాలు తొక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా నైతిక విచక్షణలు కోల్పోయి హోదాలు మంచి చెడులు మరిచి ప్రతి వర్గం లోని దాదాపు అన్ని స్థాయిల లోని వ్యక్తులు పోటీలు పడి మరీ ఎవరినిపడితే వారిని స్వంత డబ్బులతో సభ్యులుగా చేర్పించే రంధి అంతకంతకూ పెరిగిపోతున్నందున వారందరికీ బుద్ధి జ్ఞానం ప్రసాదించదానికి ఇదే మంచి అవకాశమని పలువురి విజ్ఞులు భావిస్తున్నారు

తొందరలోనే వచ్చే ఎన్నికల వేడి కొద్దినెలలో మొదలు కాబోతున్నందున మూడు వర్గాల పరిస్థితి త్వరితగతిన మారిపోతూ క్షేత్రస్థాయిలో తీవ్ర మార్పులు చోటు  చేసుకుంటున్నాయి. ఒక వర్గం కాడి పారేసి వేరే వర్గ కటాక్ష వీక్షణాలకై తపించి అస్థిత్వాన్ని కోల్పోయే నిజం తెలిసీ తెలియంగానే ‘తానా’ తెలుగు సమాజం మూడు వర్గాలనుంచి రెండు వర్గాల కు రూపాంతరం చెందుతూ తదనుగుణంగా క్షేత్ర స్థాయిలో మౌలికమైన మార్పులు త్వరితగతిన చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏళ్లతరబడి పాలించి గత ఎన్నికల్లో ఓడిన గత అధిష్టానమా వారికి ప్రత్యామ్నాయ వ్యవస్థా అనేదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. దాని ఆధారంగానే బలాబలాల పునర్వ్యవస్థీకరణ జరిగేటట్లు గాను, అందుకు దోహదపడే విధంగా తగిన నాయకులను పెద్దలను ఆయా వర్గాల వారు ఆకర్షించే ప్రయత్నాలు మొదలైయ్యాయి. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చే ఎన్నికల సమయానికి “సమరమే” అంటూ కత్తులు దూసుకునే దిశగానే సాగుతున్నట్లు అంచనా కాగా ఈ సారికైనా అందరికీ అమోగ్యులైన వారిని తెచ్చి ఎన్నికలను నివారించి సంస్థ ఎదుగుదల దిశగా అందరూ కలసివస్తే బాగుండని  పలువురు కోరుతున్నప్పటికీ అది జరిగే అవకాశమెంత అనేది ఇప్పటికైతే సందేహమే

మరి మూడు వర్గాల పరిస్థితి ఈ సారి హిందీ పాటల్లో:

అట్లాంటా బ్రదర్స్ — కాడి పారేసి
జియావో జియా కుచ్ బోలుదో
దిల్ కే పరదా ఖోలుదో
జబ్ కిసీ కె యాద్ ఆతా హాయ్
జబ్ కిసీ సే  ప్యార్  హోతా హాయ్
ఉసీ కె సాథ్ మిల్ జావో, ఆత్మ గౌరవ్ భూల్ జావో

గత అధిష్ఠానం — మిక్సడ్ ఫీలింగులతో
బహుత్ దేఖా కల్ జానేవాలే కో
బహుత్ దేఖా ఫిర్ వాపస్ ఆనే వాలే కో
కిస్ కో పతా ఆజ్ ఆనే వాలా  ఫిర్ వాపస్ జానేవాలే నహీ
హంకో హమారీ అకల్ సే బాత్ బనానా
కిసీ కో ఊపర్ పూరా భరోసా కభీ నహీ  కరనా
దూసరీ పరాజయ్ ఆత్మహత్యా కె జేసే
హోషియార్ రహానా హాయ్ హర్ పల్, హర్ పల్

ఇక మిగిలిన జే వర్గం (పక్క చూపులు మానేసి)
జో జీతా వహీ సికందర్
జో గయా ఓ గయా, సమజేంగే ఓ గద్దార్
జో బచా ఓ బచా, సమజేంగే ఓ హమారా దిల్
జో నయా ఆయా ఓ హమారీ ఆత్మ బల్
హమ్ సబ్ మిల్ కే  కరెంగే ఆత్మ సమ్మాన్
కరెంగే ఫిర్ వహీ యుద్ద్ జీతెంగే బార్ బార్
జీతెంగే బార్ బార్, లాయేంగే అసలీ “చేంజ్”

మనం మాత్రం మనకి బాగా తెలిసిన అచ్చ తెలుగు పాట వేసుకుందాం
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలూ
ఏ  నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

Tags: atlanta brothers-in-lawtana mudumukkalata
Previous Post

దోపిడీకే విశాఖ వెళ్తున్న జగన్ :కన్నా

Next Post

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

Related Posts

NRI

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

February 12, 2023
Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
TANA Elections

‘తానా’ జాయింట్ సెక్ర‌ట‌రీగా తెలుగు తేజం ‘తాళ్లూరి’

June 2, 2021
Load More
Next Post

'తానా' ఎన్నికలు-సంచలన 'ఎలక్ట్రానిక్ ఓటింగ్' తో బాలట్ కలెక్టర్ల 'తాట' తీస్తున్న 'తానా' బోర్డు!

Latest News

  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra