ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకటిని పారద్రోలినట్లు..ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలంటూ దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరిoచుకుని ప్రఖ్యాత సహస్రావధాని, పండితులు శ్రీ గరికపాటి నరసింహారావు సందేశం అందించారు.
దీపావళి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ నవంబర్ 5వ తేదీ శుక్రవారం అంతర్జాలంలో నిర్వహించిన ప్రత్యేక “కావ్య దీపావళి” కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ మన ప్రాచీన కావ్యాలలో, సంప్రదాయంలో గురువుకి, తల్లికి, స్రీలకు ప్రత్యేక గౌరవం ఉందనీ వారికి తగిన ప్రాదాన్యతనిచ్చి గౌరవించడం నేర్చుకోవాలని ఈ దీపావళి పండుగ వెలుగులు సత్యభామ శ్రీ కృష్ణులు కలసి లోకానికి అందించిన కానుకగా అభివర్ణించారు. ప్రతి వ్యక్తీ, తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి తనలోని అంతర్జ్యోతిని వెలిగించుకోవాలని తద్వారా తనతోపాటు తన తోటి మానవులకోసం, తన చుట్టూ ఉన్న సమాజహితం కోసం పాటుపడాలని హితోపదేశం చేసారు. అదే శ్రీ కృష్ణ పరమాత్మ దీపావళి సందేశమని తెలిపారు.
ఈ దీపావళి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు ప్రారంభోత్సవం చేస్తూ ఆహుతులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేసి తానా చేపడుతున్న విస్తృత సేవా కార్యక్రమాలను సభికులకు సోదాహరణoగా వివరిoచారు. భవిష్యత్తులో తెలుగువారు గర్వపడేలా “తానా” సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు అందిస్తుందని తెలియజేసారు. ఈ దీపావళి కార్యక్రమానికి రూపకల్పన చేసిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్, శిరీష తునుగుంట్ల , కమ్యునిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్, రాజా కసుకుర్తి గార్లను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని శిరీష తునుగుంట్ల ఆహుతులకు పరిచయం చేసి దీపావళి కార్యక్రమాన్ని ప్రారంభించగా, కమ్యునిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు తోటకూరి ప్రసాద్, భరత్ మద్దినేని జాయింట్ ట్రెజరర్, బిల్హన్ ఆలపాటి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో కుమారి శృతి సమన్వి కాకర్లపూడి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఆహుతులను ఆహ్లాద పరిచారు. దీపావళి పండుగ కార్యక్రమాన్ని ఘనంగా అంతర్జాలంలో నిర్వహించిన “తానా” సంస్థకు, కార్యక్రమ నిర్వాహకులకు వక్తలు ప్రత్యెక అభినందనలు తెలియచేసారు.
ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలొ ఈ క్రింద మాధ్యామాల ద్వార వీక్షించవచ్చు