‘తానా’ ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్‌కు `విశిష్ట ఉగాది` పురస్కారం లభించింది.
చెన్నైకు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ `కళాసుధ` అ అవార్డును ఆయనకు అందించింది.
గత 25 సంవత్సరాల నుండి సినిమా రంగంతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు, ప్రజాసేవలో తరిస్తున్నవారికి `కళాసుధ` అవార్డులను అందజేస్తోంది.
దీనిలో భాగంగా ‘తానా’ ఫౌండేషన్ కార్యదర్శి ప్రముఖ ఎన్నారై వల్లేపల్లి శశికాంత్ కు విశిష్ట ఉగాది పురస్కారాన్ని బుధవారం ఉగాది సందర్భంగా చెన్నైలో అందించింది.
కరోనా సమయంలోనూ, ఆ తర్వాత తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) తరఫున వల్లే పల్లి శశికాంత్ విశిష్ట సేవలు అందించారు.
‘తానా’ ఫౌండేషన్ కార్యదర్శిగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వల్లేపల్లి శశికాంత్ గుర్తింపు పొందారు.
‘శ్రీ కళాసుధ’ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న మ్యూజిక్ అకాడమీలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల మీదుగా శశికాంత్‌కు పురస్కారం అందించారు.
అనంతరం ‘తానా’ వ్యవస్థాపక కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ మాట్లాడుతూ, తన జీవితంలో అందుకున్న తొలి అవార్డు ఇదేనన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారికి సేవ చేయడంలో సంతోషం ఉంటుందని తెలిపారు.
కరోనా సమయంలో అనేక రూపాల్లో సేవలు అందించామని వివరించారు.