ప్రజలకు ఉపయోగపడేలా.. ముఖ్యంగా పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించడానికి తానా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తానా ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ చెప్పారు.
గచ్చిబౌలి స్వేచ్ఛ కార్యాలయంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు శశికాంత్ హాజరయ్యారు.
ఈ క్యాంప్ కు తానా ఫౌండేషన్ తరపున సహకారం అందించారు.
20 నెలలుగా ప్రతి మొదటి ఆదివారం నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి తానా ఫౌండేషన్ సహకారం అందించడం ఇది మూడోసారి.
ఈరోజు నిర్వహించిన శిబిరానికి కాట్రగడ్డ సునీత జ్ణాపకార్ధం కాట్రగడ్డ ప్రశాంత్ మరియు శాన్వీ దాతలుగా వ్యవహరించారు.
ఈ క్యాంప్ కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్ నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు. వీరికి 13 మంది వైద్యులు కన్సలెన్సీ సేవలు అందించారు.
హాజరైన పేషెంట్లు అందరికీ ఫ్రూట్స్ మరియు పులిహోర అందచేశారు. స్వేచ్ఛ తరపున సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బీటెక్ విద్యార్థులు, బ్యాంక్ ఉద్యోగులు ఇతర మేధావులు వలంటీర్లుగా సేవలు అందించారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ పేషెంట్లను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
మరింత మెరుగైన సేవలు అందించడానికి కూడా తాము సిద్ధమని శశికాంత్ క్యాంప్ నిర్వాహకులకు తెలియచేశారు.
ఈ మెడికల్ క్యాంప్ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారు.
ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు.
పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు.
స్వేచ్ఛ వ్యవసథాపకులు, ప్రస్తుత ఉపాధ్యక్షులు కిరణ్ చంద్ర స్వేచ్ఛ కార్యవర్గం తరపున తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.