ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయుష్ పథకం కింద చిన్నపిల్లల గుండె చికిత్సకోసం వివిధ చోట్ల క్యాంప్‌లు నిర్వహించి చికిత్సను, అవసరమైతే సర్జరీకి కూడా సహాయం చేస్తోందని ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తెలిపారు.
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ సహాయంతో జిల్లాలో ఉన్న డిఇఐసి సెంటర్లో ఈ చికిత్సను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్టణంలో, 12న విజయనగరంలో, 13న శ్రీకాకుళంలో నిర్వహించామని, మరికొన్ని చోట్ల కూడా దాదాపుగా 25కుపైగా ఈ గుండె చికిత్స శిబిరాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ ఈ ప్రాజెక్టుకు కో ఆర్డినేటర్‌గా, డోనర్‌గా కూడా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ కూకట్ల తెలిపారు.
డాక్టర్ ఎన్. శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చికిత్స నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరిస్తున్న వారందరికీ, ముఖ్యంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.