https://www.youtube.com/watch?v=JsmH3MUsyqc
మిత్రుడు..శ్రీనివాస్ కూకట్ల.. ప్రచార సభలో మీ ఆరోపణలమీద మా వివరణ:
పాయింట్ల వారీగా:
ఆరోపణ 1: మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా మొదట సంబంధిత వ్యక్తి “శ్రీనివాస్ కూకట్ల”, అని స్వయం ప్రకటితం.. మరియు తానా లో ఏకగ్రీవం కోసం, సామరస్య ధోరణితో పలుమార్లు పోటీ నుంచి విరమించుకున్నా..
వివరణ: ప్రతి రాష్ట్రంలో తెలుగు వారి సమస్యల మీద ఎన్నో తెలుగు ప్రాంతీయ సంఘాలు,జాతీయ సంఘాలు నిత్యం పనిచేస్తున్నాయి… మీరు కూడా ఒక సంస్థ వేదికగా పనిచేస్తుంటే మాత్రం..”నేనే” మార్చి “మేము” గా చెప్పండి .. అలా గాక వ్యక్తిగతంగా మాత్రమే చేస్తుంటే.. మీకు తెలియని సేవా ప్రపంచం పరిధి చాలా చాలా విస్తృతం మరియు ప్రప్రధమం అని సవినయంగా తెలియజేస్తున్నాం..
ఇకపోతే మీరు ఏ పదవి కోరుకున్నారు, తర్వాత పోటీ నుంచి ఎందుకు విరమించుకున్నారు.. సందర్భం, కారణాలు, సర్దుబాట్లు.. మనందరికీ తెలీదా?? అన్నిటిని మించి, అప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకున్న వారికోసం మీ విరమణ ..వాహ్ .. ఈ నిజాన్ని సంస్థలో సామరస్యం కాపాడటం కోసమనే ఔన్నత్య పదజాలంతో కప్పిపెట్టటం.. మీ అంతరాత్మకు వదిలేస్తున్నాం..
ఆరోపణ 2: చేయాల్సిన తప్పులు చేసి సానుకూల ప్రచారం చేసుకుంటున్నారు:
వివరణ: తప్పులు, ఒప్పులు అని చెప్పాల్సింది, తేల్చాల్సింది తానా ‘బోర్డు’, సంబంధిత కార్య వర్గం.. వారి పరిధిలో, పరిశీలనలో ఉన్న అంశాల మీద అసందర్భంగా మాట్లాడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న మీరా ఒక సేవా సంస్థను స్థాపించింది.. అయితే ఆ సంస్థలో కూడా ఇలాంటి రూల్స్ వర్తిస్తాయా.. ?? తప్పకుండా తప్పు తేలిన రోజు, నిర్ధారణ అయిన రోజు చొక్కా పట్టుకు నిలదీద్దాం.. అందరూ కలిసి, మీరు కూడా వద్దురు గాని..
ఆరోపణ 3 : 2019 కాన్ఫరెన్స్ 3.5 మిలియన్ సమీకరణ, తిరిగి 1900 డాలర్ల మిగల్చటం:
వివరణ: 3.5 మిలియన్ నిధుల సమీకరణ వాస్తవం. తర్వాత కాలంలో కొందరు దాతలు, మాట తప్పిన వారు కొందరు, పరిస్థితుల వల్ల ఇవ్వలేకని వారు కొందరు.. అలాగే కొన్ని అనుకోని ఖర్చులు పెరగటం లాంటి కారణాల వల్ల కొంత ఆర్థిక సర్దుబాట్ల వల్ల అనుకున్న నిధులు మిగల్చలేకపోవటం అందరికి విదితమే.. ఆ నిజాన్నే విన్నవించాం. మిగల్చటం కన్నా ఉన్నంతలో కాన్ఫరెన్స్ ప్రతిష్టాత్మకంగా చేయాలనే తపనతో కసితో, కార్యకర్తల అసమాన దృఢ చిత్తంతో చేసిన ప్రయత్నం ఇప్పటికీ వేలాది తెలుగు వారి స్మృతి పధంలో శాశ్వతం. తానా పరిధిని, ప్రతిష్టను సగర్వంగా నిలబెట్టాం.
అన్ని ప్రయత్నాలు, ఫలితాలు ఒకేలా ఉంటాయా?.. కాన్ఫరెన్స్ వేదిక అమెరికా రాజధానిలో… రాజస్థాన్ ఎడారిలో కాదు కదా.. తగ్గ ఖర్చులే ఉంటాయి.. అయినా సమీకరణ, ఖర్చుల సమీక్ష ఇంకా ‘బోర్డు’ పరిధిలోనే వుంది. ఎన్నికలకోసం అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించటం మీ విజ్ఞతకే..
ఆరోపణ 4 : ఫుడ్, లిక్కర్ మరియు ఫ్రూట్ కాంట్రాక్టు ల మీద ఆరోపణలు.. పేర్లు చెప్పను..
వివరణ: మీరు కొత్త పెళ్ళికొడుకు కాదుగా బ్రదర్.. పేర్లు చెప్పండి.. మీ దగ్గర ఆధారాలుంటే రండి.. తప్పుంటే నిలదీద్దాం. సంస్థకు మేలు చేద్దాం.. అంతే గాని వేపచెట్టు కింద రాష్ట్ర రాజీకీయాలను మాట్లాడే ధోరణి వద్దు. ఆధారాలతో పనే లేకపోతే మీ చుట్టూనే పలు ఆరోపణలు, విమర్శలు వున్నాయి.. అలాగని మేము మీలా నమ్మి పలువురి ముందు ఆరోపణలు చేయలేదు, ప్రోత్సహించాం కూడా.
ఆరోపణ 5 : టీం నిరంజన్ వస్తే పూర్వ అధ్యక్షుల ఆటలు సాగవు..
వివరణ: ఇది ఆట కాదు..ఇక్కడ ICC ఎంపైర్ లు అక్కర్లేదు.. ఇది సేవా సంస్థ..అంతకు మించి నాలుగు దశాబ్దాల పారదర్శకత సొంతం..మనకు నచ్చని వారు చేసేది ప్రతిదీ తప్పు కాదు.. నచ్చిన వారు చెప్పేది, చేసేది వాస్తవం కానక్కరలేదు. పూర్వ అధ్యక్షులు మీద మీ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అపరిపక్వము. వారు ఆడారో, పోరాడారో, నిలబెట్టారో మీకేం తెలుసు? మీ వయసెంత? వారి అనుభవమంత.. కాదా ? . ఒక సభ్యుడిగా మీరు ఎప్పుడైనా వారిని ప్రశ్నించండి.. కానీ ఆధారాలతో.. అవగాహన రాహిత్యం వీడి, విషయం పరిశీలన పెంచుకోండి.
చివరిగా: అవకాశం వస్తే అందరూ ప్రసంగ కేసరులమే.. కానీ ప్రాధమికే ఆధారాలు, అవగాహన ముఖ్యం. పెదవి దాటని మాటకు మనమే రాజు.. కానీ మాట పెడవి దాటితే.. ఆ మాటకు బానిసలం.. గుర్తెరిగి ప్రసంగించండి.. మీకు నచ్చిన వారితో నడవండి.. కానీ ఆరోపణలు ఆధారాలతో మాత్రమే చేయండి.. మీ గౌరవం మీ చేతుల్లో.. మీ మాటల్లో..
సంస్థకు ఎల్లవేళలా విధేయతతో.. సంఘటిత శ్రామిక కార్యకర్తల కూటమి..
పెద్దల అనుభవాన్ని గౌరవిస్తాం.. సభ్యుల సమిష్టి నిర్ణయాలకు కట్టుబడతాం..
#TeamNarenKodaali