• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ ఎన్నికల్లో చివరి అంకం

బాలట్ కవర్లు ఇవ్వాలన్న ఒత్తిడి మీద - సభ్యుల్లో అసహ్యంతో కూడిన కోపం

admin by admin
April 16, 2021
in TANA Elections
0
0
SHARES
141
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని బాలట్ కలెక్టర్లను,అగ్గితోటి కడుగు ఈ ‘తానా’ సంస్థ మురికిని, మారాలి ఈ నాయకులు, మారాలి ‘తానా’ ఓటర్లు, మారాలి ‘మన తానా’..

ముందుగా ఈ రోజు స్వర్గానికేగిన మహనీయుడు అందరికీ ఆదర్శప్రాయుడు అయి ‘తానా’  వ్యవస్థాపక అధ్యక్షులు
, ప్రఖ్యాత నిమ్స్ కు రెండు సార్లు డైరెక్టర్ గా సేవలందించిన ‘డాక్టర్ కాకర్ల సుబ్బారావు’ గారికి మా శ్రద్ధాంజలి.

అటుమంటి మహనీయులచే స్థాపించబడి విశ్వ విఖ్యాతి గాంచిన ‘తానా’ ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారం ముగింపు చివరి దశలో అందరూ అనుకునే విధంగానే మురికి అధ్యాయం జుగుప్సాకరంగా మొదలైంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు 19 ఏప్రిల్ సోమవారం గాని లేదా 20 ఏప్రిల్ మంగళవారం గాని  సియాటెల్ నుండి బాలట్ కవర్లను పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగినట్లుగా ‘తానా’ లోని రెండు వర్గాల గాడ్ ఫాదర్ లు తమకు అలవాటైన చివరి ప్రయత్నాలు ముమ్మరంగా చేయటానికి అమెరికా వ్యాప్తంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇంతకు ముందు అందరు కలిసి ఒకటై సాగించిన చీకటి వ్యవహారాలు రెండు వర్గాలగా మారి చేస్తుండడం తో అన్నిచోట్లా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరో వైపు సమాజాన్ని, ‘తానా’ సభ్యులను ఇటువంటి అనాగరిక చర్యలను వ్యతిరేకించే విధంగా ఉత్తేజపరచిన ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థి గోగినేని ప్రచారం కూడా అంతకు మించి సాధారణ సభ్యులందరికి చేరిన కారణంగా ఈ సారి ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు రెండు వైపులా చెరో ఇరవై మంది పోటీ చేయటం మూలాన ఎక్కువ మంది సభ్యులకు తమకు గాని, తమ జీవిత భాగస్వామి తరపున గాని, ఊరు-జిల్లా-కాలేజీ ద్వారా గాని రెండు వైపులా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండటం వలన వారికి ఓటు వేయాలంటే తమకు తాము గానే ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చిన కారణంగా ఎదో ఒక వర్గానికి బాలట్ ఇవ్వవద్దని అనుకుంటున్నారు.

ఇక చివరి ప్రయత్నాలుగా రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకునే విధంగా సమాజం చీదరించుకునే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడం విద్యాధికులైన అమెరికా తెలుగు సమాజంలో అసహ్యం కలిగిస్తోంది. ఆశ్చర్యమేమంటే ఈ దుష్ప్రచారం లో అందరూ ఊహించినట్లు ముందు నుంచి మోతుబరీ వ్యవస్థను పెంచి పోషించిన సతీష్, గంగాధర్, జయరాం గాడ్ ఫాథర్ల్ గా ఉన్న నరేన్ వర్గం చేసే దానికంటే కంటే మూడు రెట్లు ఎక్కువగా కొత్తగా గాడ్ ఫాథర్ల్ అవ్వాలనుకుంటున్న జయ్ తాళ్లూరి, లావు బ్రదర్స్ ల నిరంజన్ ప్యానెల్ ఈ నెగటివ్ ప్రచారం చేస్తోంది. నరేన్ వర్గం ముఖ్యం గా నిరంజన్ చెప్పుకుంటున్న 100 వేలు డొనేషన్ల పై కుప్పించిన ప్రశ్నలకు తత్తర బిత్తర పడి ఇచ్చానని ఒక సారి లేదు సమీకరించానని ఒకసారి చెప్పి ఇంకా ప్రశ్నగానే మిగల్చగా, నిరంజన్ కు రాజకీయ  పార్టీలతో ఉన్న కనెక్షనల విషయమై కూడా ఇబ్బంది లోకి నెట్టటమే కాకుండా, 75 శాతం ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకుల సపోర్ట్ ఉందని చెప్పుకుంటూ ఇంకా చేంజ్ అనే నినాదం ఎలా పనికొస్తుందనే విషయం- అలాగే ఇప్పటివరకు ఊరుకుని ఎన్నికల సమయంలో మాత్రం పాత కాన్ఫరెన్స్ లెక్కల వివరాలు అడుగుతుండడంపై ఇరకాటంలో పడ్డట్టే. దానికి తోడు శ్రీరంగ నీతులు చెపుతున్న నిరంజన్ వర్గంలో అత్యున్నత పదవికి పోటీ పడుతున్న నిరంజన్ కొన్ని విషయాల్లో ఆల్రెడీ ఇరకాటంలో ఉండగా తరువాత రెండు పెద్ద పదవులైన కార్యదర్శి , కోశాధికారి అభ్యర్థులు సతీష్ వేమూరి, అశోక్ కొల్ల  దేశ వ్యాప్తంగా ఈ బాలట్ కలెక్షన్ల వ్యవహారంలో నిస్సిగ్గుగా ముందుండి వ్యవహారాలు నడిపించడానికి ప్రయత్నిస్తుంటే వారి పై ఉన్న క్రిమినల్ కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్న విషయమై సభ్యలు చర్చించుకుంటున్నారు. ఇన్ని లొసుగులు ఉన్న నిరంజన్ ప్యానెల్ వారే రెండో వర్గంపై అభ్యంతరకరమైన ప్రచారాన్ని ముఖ్యంగా కాన్ఫరెన్స్ లెక్కల విషయంపై, నరేన్ వ్యక్తిగత విషయాలపైనా సతీష్ వేమన  పాత విషయాల పైనా ట్రోలింగ్ వీడియోలు చేస్తూ దిగజార్చడానికి పయత్నిస్తుడడం మూలంగా లాభమో నష్టమో తెలియడంలేదు. ఈ రెండు వర్గాలు చేసుకునే అభ్యతరకర ప్రచారం ఏ మచ్చలేని సీనియర్ నాయకుడైన ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థి గోగినేనికి అదనపు ప్రచారం మరియు బలంగా మారుతున్న విషయం గ్రహించటం రెండు వర్గాలకు చాల ఆలస్యమైనట్లే.

ఇక నరేన్ వర్గం తరపున బాలట్ కలెక్షన్ల వ్యవహారం లో ముఖ్యం గా సతీష్ వేమన ముందుండి వ్యూహరచన చేస్తుండగా అమెరికా వ్యాప్తంగా వ్యవస్థాగతంగా అనేక ఏళ్ల  నించి చేస్తున్న ఆరితేరిన వ్యక్తులు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక తమ శక్తి సామర్ధ్యాలపై అత్యంత విశ్వాసంగా ఉంటూ ఉన్న తమ నెట్వర్క్ ద్వారా అవతలి వర్గం ఓట్లలో కూడా అధిక శాతం కైంకర్యం చేసుకునే నమ్మకంలో ఉన్నారు. ఇక నిరంజన్ ప్యానెల్ వారు కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు గత మూడు వారాల నుంచి అనేక నగరాలలో ఇదే పనిపై ఫోకస్ పెట్టగా రోజు రోజుకీ అంచనాలు తగ్గిపోతున్నట్లు గా తెలుస్తోంది. తగ్గిన కొద్దీ అసహనం పెరిగిపోతూ ఇప్పుడు సరికొత్త గాడ్ ఫాదర్ లు కూడా రంగంలోకి దిగి అన్నివర్గాలను మద్దతు కోసం తమ స్థాయిని కూడా మరచి కాళ్లా వేళ్ళా పడుతుండటం గురించి చాల చోట్ల చర్చ జరుగుతోంది. గెలిచే వారిని  సంతృప్తి పరిచే అలవాటు పడ్డ ‘తానా’ సభ్యులు ఏ వర్గానికి గెలుపు గ్యారంటీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ బాలట్ కవర్ ఇచ్చినా వేరే వర్గం గెలిస్తే తమకు ఊర్లో తలవంపులు అని భావిస్తూ ఇండిపెండెంట్ గోగినేనికి జై చెప్తున్నట్లు, ఎవరి ఓటు వారు వేసుకుంటమే కదా ప్రస్తుతానికి బెటర్ అని భావిస్తుండడం కొసమెరుపు. ఇంకా బాలట్ కవర్ ఇవ్వమని బతిమాలడం తమ వ్యక్తిత్వాలకు చిన్న చూపుగా ఓటర్లు భావించే పరిస్థితిలో మొదటికే మోసం రాకుండా తమకు ఓటేస్తే చాలని రెండు వర్గాలు అడిగే పరిస్థితి వచ్చినట్లే.

స్థూలంగా చూస్తే ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థిగా సామాన్య ఓటర్ల మెజారిటీ మద్దతుతో గోగినేని అధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుండగా మిగతా అన్ని పదవులకు రెండు వర్గాల మధ్యన పోటా పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంతకు ముందు మొదటి వారంలో హడావిడిగా సాగే బాలట్ కలెక్టనల వ్యవహారం ఈ సారి చాలా మందకొండిగా ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ, న్యూ ఇంగ్లాండ్, వర్జీనియా, అప్పలచియాన్, అట్లాంటా, టెక్సాస్, మిచిగాన్, ఒహియో మరియు బే ఏరియాల్లో సాగి, ఒకరి గుట్టు మరొకరికి తెలిసిన కారణంగా ఘర్షణలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు అన్ని ఇళ్లకు, ఎదిరిళ్లకు కూడా సెక్యూరిటీ కెమెరాలు ఉండడంతోనూ, బాలట్ కలెక్టర్లు, అడ్రస్లుపై అందరికీ అవగాహన ఉండటం కారణంగానూ కొన్ని ఉద్రిక్త వ్యవహారాలు కూడా సంభవించే పరిణామాలు గోచరిస్తున్నాయి.

కాబట్టి అందరూ జాగ్రత్త గా ఉండాలని కోరుతూ, ఈ సందర్భంగా ఎక్కువమందికి గుర్తుకు వస్తున్న ‘గాయం’ చిత్రం లోని పాట స్పూర్తితో..

నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని బాలట్ కలెక్టర్లను, అగ్గితోటి కడుగు ఈ ‘తానా’ సంస్థ మురికిని, మారాలి ఈ నాయకులు, మారాలి ‘తానా’ ఓటర్లు, మారాలి ‘మన తానా’..
Tags: ballot collectorsTana elections
Previous Post

నరేన్ టీం-శనివారం ఏప్రిల్ 17th  బే ఏరియా పర్యటన 

Next Post

పోలింగ్ లో వైసీపీ నకిలీ ఓట్ల డ్రామా…ఈసీకి చంద్రబాబు కంప్లైంట్

Related Posts

NRI

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

February 12, 2023
TANA Elections

‘తానా’ లో మూడు ముక్కలాట-3

February 10, 2023
Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
Load More
Next Post

పోలింగ్ లో వైసీపీ నకిలీ ఓట్ల డ్రామా...ఈసీకి చంద్రబాబు కంప్లైంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra