ఛాలెంజ్ ఫేస్: రాబోయే వారంలో అన్ని ఇళ్లకు బాలౌట్స్ రాబోతుండగా, ‘తానా’ ఎన్నికల్లో ‘నువ్వే నువ్వే’ అంటూ ఒకరిపై ఇంకొకరు చేసుకొనే ఆరోపణల పై నిజాల్ని నిగ్గు దాల్చే సమయం రానే వచ్చింది.
లేటెస్ట్ ఛాలెంజ్ : నిరంజన్ శృంగవరపు 100 వేలు ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే, నేను దానికి 100 వేలు మ్యాచ్ చేస్తా అని ఛాలెంజ్ చేసిన ‘విద్య గారపాటి’ ‘తానా’ ఎన్నికలలో ‘సూపర్ పంచ్’.
‘చేంజ్’ ప్యానెల్ అని చెప్పుకుంటూ, ‘తానా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న నిరంజన్ శృంగవరపు ప్యానెల్ పై ఎన్నికల చివరి అంకం చివరిలో అత్యంత సూటిగా ఘాటుగా ‘విద్యా గారపాటి’ వేసిన ఛాలెంజ్ పంచి ‘చేంజ్’ ప్యానెల్ అవకాశాలను నిజంగానే ‘చేంజ్’ చేసేటట్లు ఉన్నట్లు అమెరికా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. నిరంజన్ మాటల్లోనూ, చేతల్లోనూ తడబడుతున్నట్లు మీడియా ఇంటర్వూస్ లోగాని ఎన్నికల స్పీచెస్ లలో గాని బయట పడుతూ ఆ ప్యానెల్ వాళ్లే ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది చివరికి ఆయన విజయావకాశాలు పైనే గాక తమ విజయావకాశాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు కొందరు అభ్యర్థులు భయపడుతూ వారు వారి వారి ముఖ్య మద్దతుదారులు, సొంతంగా కూడా ఓట్లకై పాట్లు పడుతున్నట్లు తెలియవస్తోంది. అంతే కాక కొత్త గాడ్ ఫాథర్స్ లాగా ‘ప్రస్తుత’ ‘తర్వాత’ అధ్యక్షుల ఫోటోలని ఎన్నికల ఫ్లయర్ల పై చేయించుకుంటున్న అభ్యర్థులు మరియు వారి ముఖ్య మద్దతు దారులు కూడా పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు అంగీకరించుకొంటూ, మళ్ళి అన్ని ఊర్లు తిరుగుతూ, వీలైనంతమందిని బతిమాలుకుంటూ, పరిస్థితి మెరుగు చేసుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే శ్రీనివాస గోగినేని నిశ్చలమైన ప్రచార ప్రభావం వలన గాని, రెండు వర్గాల కుమ్ములాటలతో ఇరుక్కోవటం ఇష్టంలేక గాని, బాలట్ కవర్లు ఇవ్వడానికి ఎక్కువమంది నిరాకరిస్తుండడం దేనికి సంకేతమో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారు.
కౌంటర్ ఛాలెంజ్: అధికారంలో ఉంటూ ,చేంజ్, అనే నినాదం చేయడం పట్ల వచ్చిన ప్రశ్నలకు తోడు, నిరంజన్ విరాళాలపైనా, రాజకీయ సంబంధాల పైనా వచ్చిన విమర్శలే కాక ‘కార్పొరేట్ కూటమి’ అనే ఆరోపణలను ఎదుర్కోవటానికి అన్నట్లు నరేన్ కొడాలి ప్యానెల్‌ను ఇరకాటంలో పెట్టడానికి గాను క్రితం కాన్ఫరెన్స్ లెక్కల పైనా, నరేన్ వ్యక్తిగత విషయాలపైనా, వర్గ నాయకుల పాత విషయాలపైనా కొన్ని వేదికలపై మాట్లాడటమే కాకుండా, వేరే దేశాల నుంచి కూడా ట్రోలింగ్సు చేయిస్తూ, చాటుమాటు ప్రచారాలు చేయడం జరుగుతోంది. వీటిలో కొన్ని నిజాలున్నప్పటికీ, అవన్నీ తెలిసి కూడా మూడు నెలల క్రితం వరకు ‘భాయ్’ అంటే ‘భయ్యా’ అనుకుంటూ సాగడం మీదే జనాలు చర్చించుకోవడం జరుగుతోంది. ఫక్తు కార్పొరేటు వ్యవహారాల్లాగే తమకు అనుకూలంగా ఉంటే కనబడనట్టు, కాకపోతే ఆకాశం బద్దలైన ట్లు ఆక్రోశించడం అందరికీ అర్ధమవుతోంది.
జనరల్ ఛాలెంజ్: అసలు ఈ వర్గాల విష ప్రచారాలతో సంబంధం లేకుండా ‘తానా’ విలువలు, సంస్కరణలు, సమాజ సేవే లక్ష్యంగా మహిళలు,యువత,ఇతర వర్గాలందరిని కలుపుకుపోతూ వర్గ పోరాటాల్ని నిర్మూలించి, తెలుగు వారి ఐక్యతే ధ్యేయంగా సాగిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస గోగినేని ప్రచారం సర్వజనామోదం పొందుతున్నట్లు సాధారణ ప్రజలే కాక, రెండు వర్గాల సానుభూతిపరులు కూడా ఒప్పుకుంటున్నారు. రెండు వర్గాల వ్యవహారాల శైలిపై పెరుగుతున్న ఏవగింపు తోను, గోగినేని హుందాతో కూడిన ప్రచారం కలిసి మొత్తంగా ‘తానా’ ప్రస్తుత పరిస్థితిలో నాయకత్వానికి ఆయనే తగిన వ్యక్తిగా ఎక్కువ మంది భావిస్తున్నట్లు అంచనా.
https://www.youtube.com/watch?v=VhNqwpzawis
చివరిగా ఈసారి బాలట్ కలెక్షన్ల కోసం రెండు వర్గాల నుంచి చేస్తున్న ప్రయత్నాలకు, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవటం పై విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా మూడు కారణాలు అనుకుంటున్నారు.
1.ఎప్పటిలా ఒకే బలమైన వర్గం కాక రెండు వర్గాలు ఫోన్ కాల్స్ చేయడం, ఎవరికిచ్చినా గాని, అవతలి వారితో అనవసరంగా శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకు అనుకోవడమే కాక, తమను ఇబ్బంది పెట్టి ఎన్నికల తర్వాత ఇద్దరూ కలసి పోయి తమను ‘పిచ్చివాళ్ళ’ను చేస్తారేమోనని కూడా భయం.
2. బాలట్ కలెక్షన్స్ తప్పు, మీకు నచ్చిన వారికి మీరే ఓటు వేయండి అని గోగినేని చేసిన విస్తృత ప్రచారం అట్టడుగు స్థాయికి కూడా చేరడం, దానికి స్పందిస్తుండటం.
3) రెండు వైపులా 40 మంది పైగా అభ్యర్థులు ఉండటం,ఎవరో ఒకరు రెండు వైపులా తెలిసినవారు కావడం.
చివరిగా కోవిద్ పాండెమిక్ ఇంకా యాక్టివ్ గా ఉండటం మూలంగా ఇతరులతో సంబంధాలు, ఇంకా ఇబ్బంది ఫీలవ్వడం. ఏది ఏమైనా ఎవరికి వారు ఓటు వేసి మెయిల్ చేసే పరిస్థితి వస్తే ఫలితం ఏమైనా ‘తానా’ కు మేలు జరిగినట్లే.