ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరంజన్ ప్యానల్ కాలిఫోర్నియాలోనని శాన్ రామన్, ఈస్ట్ బ్రాంచ్ పార్క్లో మార్చి 28, ఆదివారం ప్రచారం నిర్వహించింది. మండు వేసవిలో నిర్వహించిన ఈ ప్రచారంలో స్థానిక మహిళా మండలి సభ్యులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ ప్రచార సభ ఒక విహార యాత్ర/పోట్లక్ పార్టీ లాగా భావించినట్లు మహిళలు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ ప్రచార సమావేశం చాలా ఉత్సాహంగా సాగింది. ‘తానా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి పోటీ చేస్తున్న ‘నిరంజన్ శృంగవరపు’ మాట్లాడుతూ తన ఒక ప్రత్యర్థి అయిన నరేన్ ను ఉద్దేశించి 20 సంవత్సరాల అనుభవం అని చెప్పుకోవడం కాదు కనీసం ఒక్క చెప్పుకోదగిన అంశం తను సొంతంగా అభివృధి చేసి ‘తానా’ కి అందించాడా అని గట్టిగా ప్రశ్నించారు. తన స్థానిక ప్రత్యర్థి అయిన ‘గోగినేని’ ని మాత్రం ఏ విషయం లో కూడా విమర్శించక పోవటం అందరికి ఆశ్చర్యం కలిగించింది.
‘తానా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంజయ్య లావు, మరియు ప్యానెల్ లో పోటీ చేస్తున్న అశోక్ బాబు కొల్ల, రాజా కసుకుర్తి, మురళి తాళ్లూరి, డాక్టర్ ఉమ కటికి, పురుషోత్తమ్ గుడే, శ్రీనివాస్ ఓరుగంటి, జనార్దన్ నిమ్మలపూడి తదితరులు పాల్గొని తమను ఎందుకు గెలిపించాలో వారి వారి శైలి లో ఎంతో ప్రశాంతంగా వివరించారు.
ఇక, ఈ సందర్భంగా ‘తానా’ ప్రస్తుత కోశాధికారి ‘సతీష్ వేమూరి’ మాట్లాడటం మొదలు పెట్టగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గుర య్యారు.వెంటనే ఆయన సతీమణి వచ్చి ఓదార్చారు. బే ఏరియా తెలుగు సమాజం అంతా ఈ ఎన్నికలు నా వల్లే వచ్చాయని ప్రచారం చేయటం నిజమేనని అంగీకరిస్తూ, ఎందుకు ఇలా తాను చేయ వలసి వచ్చిందో వివరించే ప్రయత్నం చేసారు.
బే ఏరియా ‘కమ్యూనిస్టుగా’ పేరున్న’ శ్రీనివాస్ వేముల’ సతీష్ వేమూరి తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రచార కార్యక్రమం విజయవంతమయ్యేటట్లు ‘వినయ్ పరుచూరి’ మరియి ‘శ్రీనివాస్ వీరపనేని’ వంటి వారితోపాటు గట్టిగా శ్రమించారు. ‘శ్రీనివాస్ వేముల’ ‘నమస్తే ఆంధ్ర’ తో మాట్లాడుతూ, సిలికాన్ వ్యాలీ కార్పొరేట్ స్టయిల్లో, ఎంతో ప్రణాళికా బద్దంగా, పచ్చని కొండల మధ్య చేసిన ఏర్పాట్లను వివరించి, దాదాపు 225 మంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినట్లు, ఈ అవకాశం తమకు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.
శనివారం మిల్పిటాస్ లో..