తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA)లు సంయుక్తంగా కాలిఫోర్నియాలోని నెవార్క్ లో నిర్వహించిన వాలీబాల్/త్రో బాల్ టోర్నమెంట్-2021 ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ టోర్నీలో పలు జట్లు పోటాపోటీగా పాల్గొన్నాయి. అడ్వాన్స్ డ్, ఇంటర్మీడియట్, రిక్రియేషన్ లుగా పురుషుల గ్రూపులను విభజించగా, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు.
ఈ టోర్నీలో మొత్తం 35 టీములు, 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 7గంటల వరకు సాగిన ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రీడాకారులు, వీక్షించేందుకు ఔత్సాహికులు ఉత్సాహం చూపారు. చాలా మ్యాచ్ లు పోటాపోటీగా జరగడంతో ఇటు ఆటగాళ్లు, అటు వీక్షకులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. చాలా మ్యాచ్ లు లాంగ్ ర్యాలీలతో సాగి నరాలు తెగే ఉత్కంఠను రేపాయి.
ఈ టోర్నీలో పాల్గొన్న జట్లను టోర్నీ నిర్వాహకులు రామ్ తోట (TANA RR Northern Cal), సతీష్ వేమూరి (TANA Secretary), హరినాథ్ చికోటి (BATA President), ప్రసాద్ మంగిన (BATA Advisor) & వీరు ఉప్పాల (BATA Advisor) అభినందించారు. ఈ టోర్నీ ద్వారా వచ్చిన ఫండ్ ను ఒక మంచి కార్యక్రానికి ఉపయోగిస్తామని వారు తెలిపారు. టోర్నీని ముందుండి నడిపించిన శివ్ శేఖర్, విజయ్ లను పలువురు ప్రశంసించారు.
టోర్నీ విజయవంతం కావడంలో సహకరించిన మనీష్, ఏక్తా దాగా, శివకుమారిలను కూడా అభినందించారు. ఈ టోర్నీ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని హరినాథ్ చికోటి అన్నారు. ఆటగాళ్ల అంకిత భావాన్ని ఆయన కొనియాడారు. తానా, బాటా జట్లకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య అభినందనలు తెలిపారు. మురళి గొడవర్తి, భార్గవ్ సీ, హరి నల్లమల, శ్రీనివాస్ వీరపనేని, శ్రీకాంత్ కోనేరు, శాస్త్రి లాల్, జేపీ వేగెండ్ల, శ్రీధర్ పంచుమర్తి, ఆజాద్, వినయ్ పరుచూరి, శ్రీధర్ చావా, శ్రీని వల్లూరిపల్లి, మైక్ బండ్ల, వివేక్, వీరబాబు, రెడ్డయ్య, శ్రీధర్ రెడ్డిలు ఈ టోర్నీ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు.
ఫ్రీమోంట్ కౌన్సిల్ మెంబర్ రాజ్ సల్వన్ ఈ టోర్నీకి హాజరయ్యారు. కరోనా సమయంలో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించిన తానా, బాటా టీమ్ లను ఆయన అభినందించారు. గెలుపొందిన వారికి ఆయన ట్రోఫీలను అందజేశారు. ఈ టోర్నీలో గెలుపొందిన విజేతలను నిర్వాహకుల తరఫున రామ్ తోట అభినందించారు. టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన TANA,BATA నాయకులకు, ప్రతినిధులకు, వలంటీర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ టోర్నీకి స్పాన్సర్ చేసిన వారిని అభినందించిన రామ్ తోట…భవిష్యత్తులోనూ ఇలాగే స్పాన్సర్ షిప్ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాలకు తానా సభ్యులతో పాటు, బే ఏరియాలోని తెలుగు వారంత భవిష్యత్తులోనూ సహాయసహకారాలను అందించాలని కోరారు.
ఫలితాలు
త్రోబాల్
సిల్వర్ – థండర్స్ (రన్నర్) & పాజిటివ్ వైబ్స్ (విన్నర్స్)
వాలీబాల్ రిక్రియేషన్:
సిల్వర్ –గోల్డెన్ స్టేట్ ఏసర్స్ (రన్నర్) & సాహూ బాయ్స్ (విన్నర్)
గోల్డ్: ఫ్రీమోంట్ రైడర్స్ (రన్నర్) & యాంగ్రీ బర్ద్స్ (విన్నర్)
వాలీబాల్ ఇంటర్మీడియట్
స్పైక్ ఇట్ (రన్నర్) & ది క్రూ (విన్నర్)
వాలీబాల్ అడ్వాన్స్ డ్ రేనార్ క్లబ్ (రన్నర్స్) & నోర్ కల్ (విన్నర్)