ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో బే ఏరియాలో తెలుగు పాఠశాలను ఘనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా), పాఠశాల బృందం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులు అందరినీ పాఠశాల కో చైర్మన్ ‘ప్రసాద్ మంగిన’ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది తానా, బాటా నాయకత్వంలో అందించిన మద్దతు ఎనలేనిదని.. కొనియాడారు. తానా, బాటాలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ పాఠశాల కేవలం ఎన్నారైలకు చెందిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిందేనని ‘ప్రసాద్ మంగిన’ నొక్కి చెప్పారు. అందరికీ అర్ధమయ్యే సరళమైన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ్య మాట్లాడుతూ.. బే ఏరియా తెలుగు పాఠశాల గొప్ప సంకల్పంతో ఏర్పాటైందని.. ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తానా ప్రధాన లక్ష్యమైన తెలుగు భాషను, సంస్కృతిని తర్వాత తరాలకు అందించడాన్ని ఈ పాఠశాల.. సంపూర్ణంగా అమలు చేస్తోందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు, బాటా బృందానికి, ముఖ్యంగా’ శ్రీ జయరాం కోమటి’, పాఠశాల అభ్యున్నతి కోసం చేస్తున్న విశేష కృషిని ఆయన కొనియాడారు. వారిని పేరు పేరునా అభినందించారు. అనంతరం.. జే తాళ్లూరి మాట్లాడుతూ.. పాటశాలను 8 ఏళ్ల కిందటే ప్రారంభించినట్టు తెలిపారు. తానా తన సమర్ధవంతమైన నాయకత్వంలో.. ఇలాంటి పాఠశాలలను అమెరికాలోనే కాకుండా.. ఇతర దేశాల్లోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తుండడం సంతోషంగా ఉందని.. పేర్కొన్నారు.
బాటా సలహాదారు.. ‘శ్రీమతి విజయ ఆసూరి’ మాట్లాడుతూ.. తానా నాయకత్వంలో పాఠశాల అనూహ్య రీతిలో అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు. పాఠశాలకు తమ సహకారం మున్ముందుకూడా ఉంటుందని హామీ ఇచ్చారు.
పాఠశాల చైర్మన్.. నాగరాజు నలాజుల మాట్లాడుతూ.. ఎంతో బాధ్యతగా ఈ పాఠశాలను నిర్వహిస్తున్నామ ని.. చెప్పారు. కరిక్యూలమ్ను కూడా అంత్యంత బాధ్యతగా తీర్చదిద్దుతున్నామన్నారు. ఈ విజయంలో పాఠశాల సిబ్బంది కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాలకు సహకారం అందిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు.
బాటా అధ్యక్షులు.. ‘హరినాథ్ చికోటి’, అకడమిక్ డైరెక్టర్ ‘డాక్టర్ రమేష్ కొండా’, బాటా సలహాదారు ‘వీరు వుప్పాల’ తదితరులు.. వచ్చే ఏడాది చేరబోయే విద్యార్థులను ఉద్దేశించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ తోట(తానా ఆర్ ఆర్-ఎన్ కాలిఫోర్నియా), సతీష్ వేమూరి(తానా కార్యాదర్శి)లు.. విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. అదేసమయంలో పాఠశాలకు అన్ని విధాలా తానా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, డాక్టర్ గీతా మాధవి(కరిక్యులమ్ డైరెక్టర్), శ్రీదేవి యర్నేని, రవి పోచిరాజు, శరత్ పోలవరపు, గీత విశ్వలత, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, పద్మ విశ్వనాథ్, సునితా రాయపనేని, దీపికా అజయ్, శీలా గోగినేని, సత్య బుర్రా, అర్చనా చాడ, మమత శ్యామ్ చాడ, పద్మ శొంఠి, సురేశ్ శివపురం, ధనలక్ష్మి, మూర్తి వెంపటి, శ్రీకాంత్ దాశరథి, శ్రీధర్ కొడవలూరు, శ్రీదివ్య యలమంచిలి, రాగిని అరసద.. తదితురులు విద్యార్థులను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు పాఠశాల తరగతులు, కరిక్యులమ్, విద్యా బోధన విధానం, ఎల్ ఎం ఎస్(ఈ బోధన పోర్టల్) గురించి సవివరంగా వివరించారు.