సినిమా టికెట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును అసహ్యంచుకోని వారే ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
చివరకు ఒకప్పటి జగన్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా తప్పు పట్టిన నిర్ణయం ఇది.
రాష్ట్రంలో అనేక ముఖ్యమైన సమస్యలను వదిలి సినిమా టిక్కెట్లపై పడ్డ జగన్ ప్రభుత్వం దాని చుట్టూనే తిరిగింది.
చివరకు జగన్ సామాజిక వర్గానికి చెందిన తమ్మారెడ్డి కూడా సినీ పరిశ్రమ నుంచి తిరుగుబాటు చేశారు.
అలాంటిది సరిగ్గా నెలరోజుల తర్వాత ఆయన జై జగన్ అనడం మొదలుపెట్టారు
అందాల్సిన వారి నుంచి ఆయనకు ఏం తాయిలం అందిందో మరి..
సినిమా వాళ్లలో ఇలాంటి అనైక్యత ఉంది కాబట్టే జగన్ వారితో ఆడుకుంటున్నారు.
ఇక తాజాగా ఏం జరిగిందంటే….
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై రేపు మరోసారి జగన్ తో చిరుతోపాటు పలువురు సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, నేరుగా కలిసి చర్చిస్తే సమస్యల తీవ్రత తెలుస్తుందని అన్నారు. ఇండస్ట్రీకి ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ పెద్ద సమస్య అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి ఆన్ లైన్ వ్యవస్థ పెట్టాలనేది తమ ఆలోచనని వెల్లడించారు. క్యూబ్ సిస్టమ్ వల్ల కూడా సమస్యలు న్నాయ్నారు.
తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం వల్ల థియేటర్లో సినిమాలు చూడడం తగ్గించారని, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూశారని అన్నారు. అఖండ, పుష్ప సినిమాలను ఆంధ్రాలో బాగా ఆదరించారని చెప్పారు. 5వ షోకు పర్మిషన్ ఇస్తే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నంది అవార్డులను ఇవ్వాలని కోరనున్నామని చెప్పారు.
ప్రభుత్వాల నుంచి సినిమాలకు సబ్జిడీ ఆశిస్తున్నామని, థియేటర్లకు కరెంట్ ఛార్జీలు కమర్షియల్ గా కాకుండా యాక్చువల్ గా ఉండాలన్నారు. జగన్ చిరజీవిని జగన్ పిలిచారని.. ఆయన వెళ్తే ఇండస్ట్రీ గురించి మాట్లాడతారని అన్నారు. పరిశ్రమ పెద్ద మనుషులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తారని… ఎవరు ఏది చేసినా పరిశ్రమ మేలు కోసమేనని చెప్పారు. దీంతో, టికెట్ రేట్ల తగ్గింపునకు తమ్మారెడ్డి కూడా అనుకూలంగా మాట్లాడారన్న టాక్ వస్తోంది.