మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మూడున్నర పదుల వయసు దాటుతున్నప్పటికీ తమన్నా లైమ్ టైంలో ఉండేందుకు తాపత్రయ పడుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు తమన్నా పెద్ద ఆప్షన్ గా మారిపోయింది.
విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు హీరోయిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీళ్లకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ మిల్కీ బ్యూటీ. ఈ వయసులో కూడా తనకు అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో పాటు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తుండటంతో తమన్నా కెరీర్ హాయిగా కొనసాగుతోంది.
ఇటీవల `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకున్న తమన్నా.. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంకర్`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది తమన్నా.
అందులో విలక్షణ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన `బబ్లీ బౌన్సర్` ఒకటి. ఆ మూవీ సెప్టెంబర్ లో నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. దీంతో పాటు హిందీలో `బోల్ చుడియన్`, `ప్లాన్ ఏ ప్లాన్ బి` అనే చిత్రాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే సినిమా రంగంలో హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని ? వారు ఇప్పటికీ హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగా ఉండిపోతున్నారే తప్ప సరైన కథాబలం ఉన్న పాత్రలో నటించలేక పోతున్నారంటూ ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాధారణంగా సీనియర్ నటిమణులు తమ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి.. వయసు ముదిరిపోయాక ఓపెన్ గా చెబుతున్నారు.
ఇప్పుడు తమన్నా కూడా తాను ఎదుర్కొన్న అవమానాలు, సినిమా పరిశ్రమంలో ఉన్న అసమానతలు, మహిళలు పడే ఇబ్బందులు గురించి ఏకరువు పెట్టింది. తాను పని చేసిన సినిమాల్లో ఏదైనా అంశం గురించి మాట్లాడితే దాన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని.. అసలు తన అభిప్రాయం రైటా ? రాంగా అన్నది కూడా చెప్పేవారు కాదని.. దీంతో తాను చెప్పిన అంశంపై తానే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వచ్చేదని వాపోయింది.
సినిమా రంగంలో మహిళలకు అసలు మర్యాద లేదని.. ఒకానొక సమయంలో తాను కేవలం కథతో సంబంధం లేకుండా హీరోలను ప్రేమించే పాత్రలకే పరిమితమైపోయానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం హీరోయిన్ల పాత్ర విషయంలో మార్పులు వస్తున్నాయని.. మంచి ప్రాధాన్యంతో పాటు కథలో బలంగా ఉండే పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. హీరోయిన్లు కూడా హీరోలతో సమానమైన పాత్రలలో నటిస్తున్నా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని.. నిర్మాతల నుంచి ఒకవేళ రెమ్యూనరేషన్లు అందుకున్నా తగిన గుర్తింపు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక హీరోయిన్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే నానా రచ్చ చేస్తున్నారని. అదే హీరోలు ప్రమోషన్స్ ను పట్టించుకోకపోయినా ఎవరు అడగడం లేదని తమన్నా చెప్పింది. హీరోయిన్లు ప్రమోషన్లలో లేకపోతే నిర్మాతలు, దర్శకులతో విభేదాలు అంటూ ఇష్టం వచ్చినట్లు వార్తలు కూడా రాస్తున్నారని తమన్నా తెలిపింది. ఏదేమైనా తమన్నా మొత్తానికి తన మనసులో బాధ, ఆవేదన ఇలా వెళ్లగక్కింది. దీంతో ఇప్పుడామె మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Comments 1